కాంగ్రెస్ అధినేత్రి తోగాని, రాహుల్ గాంధీ తో నాకు ఇబ్బంది లేదు.. జగ్గారెడ్డి

జగ్గారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే.దేశ ఆర్థిక వ్యవస్థ ను అభివృద్ధి చేసింది కాంగ్రెస్సే.

 Jaggareddy Sensational Comments On Congress Party Details, Jaggareddy ,sensation-TeluguStop.com

కాంగ్రెస్ అధినేత్రి తోగాని, రాహుల్ గాంధీ తో నాకు ఇబ్బంది లేదు.సోనియాగాంధీ, రహుల్ గాంధి గొప్ప త్యాగాల కుటుంబం.

తెలంగాణ ఉద్యమం లో కాంగ్రెస్ నుండి నేను వ్యతిరేకంగా ఉన్న.అప్పటినుండి తెలంగాణ వ్యతిరేకునిగా అపకీర్తి పొందుతున్న.

కాంగ్రెస్ పార్టీకి తన నియోజకవర్గ అభివృద్ధి దృష్ట్యా టీఆరెస్ పార్టీనుండి వచ్చిన.వైఎస్,రోశయ్యలతో కలిసి పనిచేసిన.

కేసీఆర్ నాకంటే పెద్దోళ్ళు ఏజ్ లో రాజకీయంలో చాలా జూనియర్.ఇప్పటికి అన్ని పార్టీల కండువా లు కప్పుకున్న.

ఇప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానం తో కాదు రేవంత్ కు జగ్గారెడ్డికి మధ్య జరుగుతున్న తగాదా.రేవంత్ మెదక్ పర్యటనకు నన్ను పిలువలేదు.

అక్కడి వాళ్లకు చెప్పు అన్నాడు.

కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు గమనించాలి.

నను రేవంత్ కావాలనే ఇలాంటి రెచ్చగొట్టే విధి విధానాలు వ్యవహరిస్తారు.ఒకసారి కేసీఆర్ పేరుమీద,రెండు సార్లు కాంగ్రెస్ సోనియాగాంధీ, రాహుల్,పేర్ల మీద గెలిచిన.

మూడు సార్లు గెలిచిన నాకు గింత కూడా ఇజ్జత్ పిసిసి ఇవ్వడా.నాకు శీల పరీక్ష.

సీతమ్మ తల్లి లాగా అగ్నిపరిక్షా నేను చేస్తే కాలిపోతా.మొన్న సీఎల్పీ లో వచ్చి రేవంత్ ఆలింగనం చేసిండు.

నేను గౌరవించిన వద్దనలేదు.కానీ లోపలికి వెళ్లి రేవంత్ జగ్గారెడ్డికి ఓదార్చిండు.

కలిసిపోయిండ్రు అని మీడియాలో వచ్చింది.అందరూ లోపలికి వెళ్లి బుజ్జగించిండు అనుకుంటున్నారు.

కానీ లోపల జరిగింది మీకు చెప్పాలి.రేవంత్ నిజస్వరూపం తెలువాలి.

Telugu Chandrababu, Congress, Jagga, Rahul Gandhi, Revanth Reddy, Sensational, S

రేవంత్ కలిసి పోదాం అని,మెదక్ కలిసి పొదమని ఎం చెప్పలే.కేసీఆర్ చాలా సీరియస్ గా ఉన్నాడు.యశోదా ఆస్పిటల్,ప్రగతి భవన్ పోలీస్ ఆధీనంలో ఉన్నది అని మనం అలెర్ట్ గా ఉండాలని చెప్పిండు.చంద్రబాబు దగ్గర ఎం ట్రెనింగ్ అయిండో తెలియదు.రేవంత్ దగ్గర సోషల్ మీడియా ఉంది,నాదగ్గర లేదు అందుకే మీడియా ముందుకు వచ్చిన.కాంగ్రెస్ కు నాకు మధ్య కాదు.

రేవంత్ కు జగ్గారెడ్డికి మధ్య వ్యక్తుల ఘర్షణ.ముత్యాల ముగ్గు సినిమా తరహాలో నా పరిస్థితి కాంగ్రెస్ లో ఉన్నది.

నేను ఇప్పటికి కాంగ్రెస్ పార్టీతోనే పని చేస్తా, సోనియాగాంధీ రాహుల్ అడుగుజాడల్లోనే పనిచేస్తా.కాంగ్రెస్ పార్టీని విడువను,కాంగ్రెస్ లో ఉన్న మజా,కాంగ్రెస్ లో చేసే సేవా మజా వేరు.

రేవంత్ నాకు ఝలక్ ఇవ్వడం కాదు నా ఝలక్ ఎలా ఉంటదో నేను చూపిస్తా.రేవంత్ రెడ్డి వల్లనే నేను ఈరోజు మీడియా ముందుకు వచ్చాను.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube