ప్రొమోషన్స్ ఓకే జక్కన్న.. మరి నార్త్ ఇండియన్స్ ను ఆర్ఆర్ఆర్ మెప్పించ గలుగుతుందా?

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమాను టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కించాడు.

 Rrr Movie Promotions In North , Rrr Movie , Rrr Movie Promotions , Rajamouli ,-TeluguStop.com

ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు.ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుంటే.

ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నాడు.

పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా మార్చి 25న రిలీజ్ కానుందని ఇటీవలే ప్రకటించారు.

డివివి దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించిన విషయం తెలిసిందే.దాదాపు 550 కోట్లతో ఈ సినిమా తెరకెక్కింది అని టాక్.

మరి అంత బడ్జెట్ తో తీసిన సినిమా అంటే ప్రొమోషన్స్ కూడా అదే స్థాయిలో ఉండాలి.లేకపోతే ఈ సినిమా కలెక్షన్స్ మీద దెబ్బ పడుతుంది.

అందుకే రాజమౌళి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ప్రొమోషన్స్ చేస్తున్నాడు.సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అన్ని చోట్ల వరుస ఇంటర్వ్యూలు, ఈవెంట్ ల చేస్తూ ఈ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాడు.

బాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు టీమ్ మొత్తం కష్టపడుతుంది.ఇప్పటికే బెంగుళూరు, గుజరాత్, ఢిల్లీ లలో పర్యటించారు.

తాజాగా జైపూర్ ల్యాండ్ అయ్యారు టీమ్.

Telugu Bangalore, Biggestmulti, Delhi, Dvv Danayya, Gujarat, Komaram Bheem, Raja

అక్కడే కోల్కత్త, వారణాసి పట్టణాల్లో పర్యటించి సినిమాను ప్రోమోట్ చేయనున్నారు.ఈ టీమ్ అంతా ఎక్కడికి వెళ్లిన మంచి రెస్పాన్స్ అందుకుంటు పోతుంది.దీంతో ఈ సినిమా నార్త్ లో కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది.

అయితే మెజారిటీ నార్త్ ఇండియన్స్ ఇప్పటికే స్వాతంత్ర్య నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలను చూసారు.అలాగే వాటిల్లో చాలా శాతం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.

మరి ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ ఆ లిస్టులో చేరుతుందా లేదా అని ఇప్పుడు అందరు చర్చించు కుంటున్నారు.మరి ఈ సినిమా నార్త్ ప్రేక్షకులను మెప్పించి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube