ఏపీలో ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ నిధులు విడుదల అయ్యాయి.ఈ మేరకు 357 మంది విద్యార్థులకు రూ.45.53 కోట్లను సీఎం జగన్ జమ చేశారు.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ లంచాలు, వివక్ష లేకుండా విద్యార్థుల కోసం నిధులు ఇస్తున్నామన్నారు.గత ప్రభుత్వం రూ.300 కోట్లకు పైగా బకాయిలు పెట్టిందని, గతంలో కేవలం రూ.10 లక్షలు మాత్రమే ఇచ్చేవారని తెలిపారు.కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నిరుపేద విద్యార్థులకు రూ.కోటిపైనే నిధులు ఇస్తున్నామని పేర్కొన్నారు.రాజకీయాలకు అతీతంగా విద్యార్థులకు సాయం చేస్తున్నామన్నారు.విద్యా వ్యవస్థలో ఇది విప్లవాత్మక మార్పు అని సీఎం జగన్ తెలిపారు.
తాజా వార్తలు