బిగ్ బాస్ లో ఫైమా.. తప్పు చేసిందంటున్న నెటిజన్స్‌

తెలుగు బుల్లి ప్రేక్షకులు ఎప్పుడు అంటూ ఎదురు చూసిన బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం అయింది.ఎప్పటిలాగే నాగార్జున హోస్ట్‌ గా వ్యవహరిస్తున్నారు.

 Jabardasth Faima In Telugu Biggboss , Jabardasth , Faima, Bigg Boss , Telugu Bi-TeluguStop.com

సీజన్ లో ఎంతో మంది ప్రత్యేకమైన కంటెస్టెంట్లు జాయిన్ అయ్యారు.నిన్నటి ఎపిసోడ్ లో మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ ఇంట్లో అడుగు పెట్టారు.

బిగ్ బాస్ ఇల్లు ప్రస్తుతం కళ కళలాడుతోంది.ప్రేక్షకుల్లో కొందరు కంటెస్టెంట్స్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.

బిగ్ బాస్ లో ప్రతి సారి జబర్దస్త్ కమెడియన్స్ ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు.ఈ సారి ఇద్దరూ బిగ్ బాస్ ఇంట్లో జబర్దస్త్ నుండి అడుగు పెట్టారు.

వారే చలాకి చంటి మరియు ఫైమా.వీరిద్దరూ కూడా నిన్న మొన్నటి వరకు జబర్దస్త్ లో కనిపించిన వాళ్లే.

ఫైమా కి పటాస్ మరియు జబర్దస్త్ కార్యక్రమాలు ఎంతటి పేరు తీసుకొచ్చాయో ప్రత్యేకంగా చెప్పన క్కర్లేదు.ఆమె తనదైన నటనతో జబర్దస్త్ లో బుల్లెట్ భాస్కర్ టీం తో పాటు ఇంకా హైపర్ ఆది ఇతర టీం లో కూడా కనిపిస్తూ సందడి చేస్తూ తెగ నవ్వించేస్తుంది.

రష్మీ మరియు రోజా లకు ఎంతో ఇష్టమైన ఈ ఫైమా కమెడియన్ ఇప్పుడు బిగ్ బాస్ లో ఎంట్రీ ఇవ్వడంతో కొందరు జబర్దస్త్ అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఫైమా ఇలా చేసి ఉండకూడదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే.

మంచి ప్లాట్ఫారం కోసం ఎదురు చూస్తున్న ఫైమా కి ఈ బిగ్ బాస్ ఖచ్చితంగా మంచి గుర్తింపును తీసుకొస్తుంది అంటూ అంతా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.జబర్దస్త్ కార్యక్రమం ఆమె కు స్టార్డం తీసుకు వస్తే ఇప్పుడు ఆ స్టార్డం తో బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చిందని ఆమె విశ్వాసం లేకుండా వ్యవహరించిందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సమయం లో ఆమె ను ప్రేమిస్తున్నట్లుగా చెప్పుకుంటున్న జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ ఎక్కడ అంటూ మరి కొందరు కూడా కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి ఫైమా అయితే బిగ్బాస్ లో ఎంట్రీ ఇచ్చింది.

మరి అక్కడ ఈమె ప్రస్థానం ఎలా సాగుతుంది అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube