ముఖ్యంగా ఈ కాలంలో చుండ్రు సమస్య అధికంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది.తెల్లని పొట్టు మాదిరిగా రాలి పోతూ ఉంటుంది.
ఈ సమస్యను ఆలా వదిలేయకుండా మనకు ఇంటిలో సులభంగా దొరికే వస్తువులతో సులభంగా ఈ సమస్య నుండి బయట పడవచ్చు.
వెనిగర్ మూడు కప్పుల నీటిలో ఒక కప్పు వేడినీరు కలపాలి .తల మీద మెల్లగా మసాజ్ చేస్తూ ఆ నీటిని పోయాలి.15 నిమిషాల తర్వాత తలస్నానము చేస్తే సరిపోతుంది.ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే చుండ్రు సమస్య తొందరగా తగ్గిపోతుంది.
ఆముదం దీనిలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండుట వలన రకరకాల ఇన్ ఫెక్షన్స్ ని దూరంలో చేయటంలో సహాయపడుతుంది.
రక్తప్రసరణ మెరుగు అవుతుంది.తలకు ఆముదంతో మసాజ్ చేసి ఒక గంట తర్వాత తలస్నానము చేయాలి.
పెరుగు,నిమ్మకాయ ఒక నిమ్మకాయ రసాన్ని ఒక కప్పులోకి తీసుకోని దానిలో ఒక కప్పు పెరుగు కలపాలి.ఈ మిశ్రమాన్ని జుట్టుకు ప్యాక్ వేయాలి.ఒక గంట అయ్యాక తేలికపాటి షాంపూ తో తలస్నానము చేయాలి.
వేప ఈ ఆకుల్లో యాంటీ ఫంగల్ గుణాలు అధికంగా ఉన్నాయి.
ఒక బకెట్ నీటిలో ఐదు గుప్పెళ్ళ వేప ఆకులను వేసి, అరగంట అయ్యాక నీటిని వడగట్టి తలస్నానానికి ఉపయోగించాలి.