జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న వాళ్లలో జబర్దస్త్ పవిత్ర ఒకరు.మాది చాలా లో క్లాస్ ఫ్యామిలీ అని పని చేస్తేనే పూట గడుస్తుంది అనే కుటుంబం నుంచి నేను వచ్చానని జబర్దస్త్ పవిత్ర అన్నారు.
మూడు పూటలా తినడానికి కూడా అందరూ ఆలోచించే వాళ్లమని పవిత్ర కామెంట్లు చేశారు.డాడీ లారీ డ్రైవర్ అని ఆమె పేర్కొన్నారు.
ఆయన డ్రింకర్ అని ఆమె అన్నారు.
అమ్మ ఫార్మర్ అని జబర్దస్త్ పవిత్ర పేర్కొన్నారు.
నేను ఇంటర్ వరకు చదివానని ఆదాయం కోసం కెరీర్ పరంగా రూట్ మార్చనని ఆమె తెలిపారు.నాన్న నాకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసేవారు కాదని నాన్న ప్రపంచమే వేరని పవిత్ర వెల్లడించారు.
నాన్న ఇంటికి వచ్చేవారు కాదని ఆమె అన్నారు.నాన్న ప్రేమను మిస్ అయ్యేదానినని ఆమె పేర్కొన్నారు.
నేను జోక్స్ వేస్తే నా ఫ్రెండ్స్ బాగా నవ్వేవారని ఆమె తెలిపారు.
జబర్దస్త్, ఇతర కామెడీ షోలను చూసి ఇన్స్పైర్ అయ్యానని పవిత్ర కామెంట్లు చేశారు.సెలూన్ ను ఏర్పాటు చేశానని అయితే దానిని మెయింటైన్ చేయడం కష్టమైందని ఆమె తెలిపారు.మాకు సొంత ఇల్లు కూడా ఉండేది కాదని పవిత్ర తెలిపారు.
ఇటీవల మా నాన్న చనిపోయారని ఆమె పేర్కొన్నారు.నేను ఏడవనని ఆమె తెలిపారు.13 ఏళ్లు నాన్నతో మాట్లాడేదానిని కాదని ఆమె చెప్పుకొచ్చారు.
నాన్న బాగుండి ఉంటే అమ్మ, నేను వేరే లెవెల్ లో ఉండేవాళ్లమని పవిత్ర తెలిపారు.నాన్న చనిపోయారని తెలిసి సంతోషంగా ఫీలయ్యానని ఆమె పేర్కొన్నారు.పవిత్ర చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పవిత్రకు ఇతర ఛానెళ్ల నుంచి కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది.