తిరుమల శ్రీవారిని ఇస్రో బృందం దర్శించుకున్నారు.గురువారం ఉదయం ఇస్రో డైరెక్టర్ ఏకే.
పాత్రా, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ గుప్తా, ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఆర్.వై.యశోదాలు కలిసి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.ముందుగా స్వామి వారి పాదాల చెంత ఎస్ఎస్ఎల్వీ-డీ2 రాకేట్ ప్రయోగం నమూనాలను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.