మన దేశంలో దాదాపు చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని గట్టిగా నమ్ముతారు.ఇంట్లో ఆనందం, శ్రేయస్సును కొనసాగించడంలో వాస్తు సహకారం ఖచ్చితంగా ఉంటుందని విశ్వసిస్తారు.
ఈ నిబంధనలో నిర్లక్ష్యం చేస్తే రానున్న రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతూ ఉంటారు.అదే విధంగా ఇంట్లో బూట్లు మరియు చెప్పులు ఉంచడానికి కూడా వాస్తు అనుసరిస్తారు.
చెప్పులు మరియు బూట్లను ఎక్కడపడితే అక్కడ ఉంచడం వల్ల దురదృష్టం వ్యక్తిని చుట్టూ ముడుతుందని చెబుతూ ఉంటారు.
కాబట్టి ఇంట్లో అదృష్టం అలాగే ఉండడానికి బూట్లు మరియు చెప్పులు ఎలా ఎక్కడ ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు ప్రకారం బూట్లు మరియు చెప్పులు ఎప్పుడు సరైన స్థలంలో ఉంచాలి.చెప్పులు మరియు బూట్లు ఎలా పడితే అలా ఉంచడం వల్ల ఇంటి సభ్యుల మధ్య గొడవలు వస్తాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు, ఉత్తర దిశలు పవిత్రమైనవి.కాబట్టి ఇక్కడ బూట్లు మరియు చెప్పులు అసలు ఉంచకూడదు.ఈ స్థలంలో చెప్పులు ఉంచడం ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి.

ఇంట్లో బూట్లు మరియు చెప్పుల కోసం షూ-రాక్‌లో ఉంచడం మంచిది.బూట్లు మరియు చెప్పులు ఎప్పుడు అమలుచబడి షూ-రాక్‌లో మాత్రమే ఉంచాలి.షూ-రాక్‌ను వాస్తు ప్రకారం నైరుతి దిశా లో ఉంచడం మంచిది.
ఇల్లు చిన్నదిగా ఉండడం వల్ల చాలాసార్లు షూ-రాక్ ను బెడ్ రూమ్ లోనే ఉంచుతారు.కానీ వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల దంపత్య జీవితంలో గొడవల వస్తాయి.

ఇంటికి ప్రధాన తలుపులు చాలా ముఖ్యమైన భాగం.ఎందుకంటే ఈ ప్రదేశం నుంచి సానుకూల శక్తి వస్తూ ఉంటుంది.అంతేకాకుండా ఇంటి ప్రధాన ద్వారం నుంచి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని చెబుతూ ఉంటారు.అందుకే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఎప్పుడు శుభ్రతగా, అందంగా ఉండేలా చూసుకోవడం ఎంతో మంచిది.