ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు.ఇక ఈ క్రమంలోనే కొంతమంది దర్శకులు మాత్రం వాళ్లను వాళ్లు పాన్ ఇండియా వైడ్ గా మంచి గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు.
ఇక ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాలతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటారు.

తద్వారా ఆ సినిమాతో వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ ని సంపాదించుకుంటారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక బుచ్చిబాబు సనా, శ్రీకాంత్ ఓదెల మధ్య విపరీతమైన పోటీ అయితే నడుస్తుంది.వీరిద్దరూ సుకుమార్ శిష్యులే అయినప్పటికి వీళ్ళ సినిమాలతో మరోసారి ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నమైతే చేస్తున్నారు.ఇక శ్రీకాంత్ ఓదెల చేస్తున్న పారడైజ్ సినిమా( Paradise Movie ) మార్చి 26 2026వ సంవత్సరంలో రిలీజ్ అవ్వబోతుండగా, బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్( Ram Charan ) హీరోగా వస్తున్న పెద్ది సినిమా( Peddi Movie ) మార్చి 27 2026వ సంవత్సరంలో రిలీజ్ అవుతుంది.

మొత్తానికైతే ఒక్కరోజు గ్యాప్ లోనే రెండు సినిమాలు వస్తూ ఉండటంతో ఈ సినిమాల్లో ఏ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తోంది.ఏ సినిమా డీలా పడుతుంది అనేది తెలియాల్సి ఉంది.ఇక ఈ రెండు సినిమాల గ్లింప్స్ చూసినట్లయితే ఈ రెండు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.దానివల్ల ప్రేక్షకుల్లో అమితమైన ఆసక్తి ఉండడమే కాకుండా రెండు సినిమాల ద్వారా ప్రేక్షకుల్లో గుర్తింపును తెచ్చుకోవాలని ఇద్దరు హీరోలు కూడా ఆరటపడుతున్నట్టుగా తెలుస్తోంది.
అలాగే ఇద్దరు దర్శకులు సైతం ఫ్యాన్ ఇండియా నేపథ్యంలో సినిమా చేసి భారీ విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతుండటం విశేషం…చూడాలి మరి ఈ సినిమాలతో వాళ్ళు ఎలాంటి సక్సెస్ సాధిస్తారు అనేది…
.