గత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ సీట్లు గెలుచుకుని అత్యంత బలహీన ప్రతిపక్షం గా నెట్టుకొస్తున్న టీడీపీ లో చంద్రబాబు నాయుడు తర్వాత అధ్యక్ష పదవిని అలంకరించి ,గాడి తప్పిన పార్టీ కి పూర్వ వైభవం తీసుకువచ్చే నాయకుడు ఎవరనే చర్చ సర్వత్రా జరుగుతుంది….చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ను ఒక వర్గం బలపరుస్తుండగా మరో వైపు పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు మరియు మెజార్టీ ప్రజల నుండి బలం గా వినిపిస్తున్న పేరు జూనియర్ ఎన్టీఆర్ .
సినిమాల్లోనూ , రాజకీయాల్లోనూ తనదైన శైలిలో ముద్ర వేసి తాతకు తగ్గ మనవడి గా పేరొందిన ఎన్టీఆర్ అయితేనే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పార్టీ కి తిరిగి కొత్త కళ తీసుకురాగల సత్తా ఉన్నవాడని వారు భావిస్తున్నారు….తాజాగా ఈ వాదనకు మద్దతుగా పోసాని మురళీ కృష్ణ కూడా ఎప్పటికైనా టీడీపీ లో నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమేనని తన అభిప్రాయం చెప్పారు.

ఇటీవలే ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పోసాని మాట్లాడుతూ ” వయసు పైబడిన సమయం లో సీనియర్ ఎన్టీఆర్ భార్య ను కూడా కోల్పోయి చేయూత గా కూడా ఎవరూ లేని పరిస్థితి లో కుటుంబ సభ్యులు అందరూ వదిలేసిన ఆయనకు అండగా నిలబడి సేవలు చేసిన లక్ష్మీ పార్వతి నీ టీడీపీ వాళ్లు ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారనీ,హరికృష్ణ రెండో భార్య ,తారక్ తల్లిని నీ తిట్టే ధైర్యం వీళ్లకు లేదని చెప్పుకొచ్చారు…ఒకవేళ అలా చేస్తే జూనియర్ ఎన్టీఆర్.ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందనీ,ఇండస్ట్రీ లో ఇప్పుడు టాప్ రేంజ్ లో ఉన్న ఎన్టీఆర్ తో ఈ సమయం లో కయ్యం పెట్టుకోడానికి టీడీపీ వాళ్లు భయపడుతున్నారని, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓట్లు పోతాయని వారి భయమని చెప్పుకొచ్చారు.

ఈ క్రమం లో టిడిపి నుండి తర్వాత ముఖ్యమంత్రి అవ్వగలిగే శక్తి ఉన్న నాయకుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమేనని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు…ప్రస్తుతం వైసీపీ లో ఉంటూ , ఏపీ ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ గా భాద్యతలు వ్యవహరిస్తున్న పోసాని ఇలాంటి కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.మరో వైపు వరుస హిట్ల తో గ్లోబల్ స్టార్ రేంజ్ కి ఎదుగుతున్న జూనియర్ ఎన్టీఆర్తన సినిమాలతో బిజీ గా ఉంటూ రాజకీయాలకు ఇంకా చాలా సమయం ఉందంటున్నారు…కాబట్టి ఎవరి భవిష్యత్తు ఏం అవ్వబోతుందో ,ఎవరి వల్ల పార్టీ భవిష్యత్తు మారబోతోంది అన్నది కాలమే నిర్ణయించాలి….