వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా పేరుపొందిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి( YCP MLA Alla Ramakrishna Reddy ) నిన్న కీలక నిర్ణయమే తీసుకున్నారు.పార్టీకి , శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు.
ఆయనను బుజ్జగించేందుకు వైసిపి కీలక నాయకులంతా ప్రయత్నించినా ఆయన మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు ఇష్టపడలేదు.అసలు ఆళ్ల రామకృష్ణారెడ్డి అసంతృప్తికి కారణాలు చాలానే ఉన్నాయి.2014 – 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఆళ్ల గెలుపొందారు .2019లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) పైన విజయం సాధించారు.ఆ ఎన్నికల ప్రచార సమయంలోనే ఆళ్ళను మంగళగిరి నుంచి గెలిపిస్తే మంత్రిని చేస్తానంటూ జగన్ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు.అయితే సామాజిక వర్గాల సమీకరణాల నేపథ్యంలో ఆళ్లకు మంత్రి పదవి దక్కలేదు.
ఈ అసంతృప్తి రామకృష్ణారెడ్డి లో చాలనే ఉంది దీనికి తగ్గట్లుగానే కొంతకాలంగా నియోజకవర్గంలో వైసీపీలోని తన వ్యతిరేక వర్గాలను ప్రోత్సహిస్తూ ఉండడం, తనకు టికెట్ ఇచ్చే అవకాశం కనిపించకపోవడం , తదితర కారణాలతో ముందుగానే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతుంది .అయితే ఆ అసంతృప్తి తో పాటు, రాజకీయంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారని అందుకే రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.దీంతో ఆళ్ళ ఏ పార్టీలో చేరబోతున్నారనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.” నేను కాంగ్రెస్ వాదిని మా కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్ ( Congress )వాదులమే అంటూ చెబుతున్నారు.జగన్ సోదరి షర్మిలకు సన్నిహితుడుగా రామకృష్ణారెడ్డికి పేరు ఉంది.
షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించిన తరువాత ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆమెతో భేటీ అయ్యారు .ఆ సమయంలో వైసీపీ కీలక నాయకులు షర్మిల పైన పరోక్షంగా విమర్శలు చేస్తున్న సమయంలోనే ఆళ్ళ రామకృష్ణారెడ్డి షర్మిలను కలవడం సంచలనం రేపింది. ఇదిలా ఉంటే తెలంగాణ ఎన్నికల్లో షర్మిల పోటీకి దూరంగా ఉన్నారు.
కాంగ్రెస్ కు మద్దతుగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు.ఈ క్రమంలోనే షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.
దీంతో రామకృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతుంది.షర్మిలకు మద్దతుదారుడిగా ఉండటం వల్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి దక్కలేదనే ప్రచారం వైసీపీ లో జరుగుతోంది.