శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో కింజారపు ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంటుంది.నాలుగు దశాబ్దాలకు పైగా కింజారపు ఫ్యామిలీ రాజకీయాల్లో ఉంది.
అధికారం ఉన్నా లేకపోయినా కింజారపు ఫ్యామిలీ జిల్లాను శాసిస్తోంది.ఎర్రన్నాయుడు మరణాంతరం ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడు యువ కెరటంలా దూసుకుపోతున్నారు.
ఇప్పటికే రెండు సార్లు ఎంపీగా గెలిచి సత్తా చాటారు.అటు ఢిల్లీలో కూడా బలంగా వాణిని వినిపిస్తున్నారు.
అద్భుతంగా మాట్లాడే టాలెంట్ రామ్మోహన్ నాయుడు సొంతం.అన్ని భాషలపై ఆయనకు పట్టు ఉంది.ఆయన ఉన్నత విద్యలను కూడా అభ్యసించారు.అందుకే రాజకీయాల్లో ఆయన స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు.
రామ్మోహన్ నాయుడికి ప్రజల్లో మంచి క్రేజ్ ఉంది.ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆయన ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని స్థానికులు ఒత్తిడి చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.
ఈ మేరకు అసెంబ్లీ నియోజకవర్గాన్ని కూడా కింజారపు ఫ్యామిలీ ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.తమ సామాజికవర్గం ఎక్కువగా ఉండే నరసన్నపేట అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారట.
మరోవైపు నరసన్నపేటలో వైసీపీ తరఫున పోటీ చేస్తున్న ధర్మాన బ్రదర్స్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.దీంతో రామ్మోహన్ లాంటి యువ నేత బరిలోకి దిగితే సైకిల్ పరుగులు తీయడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.
పైగా ఇక్కడ మాజీ ఎమ్మెల్యేలు బగ్గు లక్ష్మణ రావు, రమణమూర్తి మద్దతు కూడా రామ్మోహన్‌కే ఉందని స్థానికులు చెప్తున్నారు.అటు ఎంపీగా కంటే ఎమ్మెల్యేగా ఉంటేనే రాజకీయంగా ఇంకా బలమైన ముద్ర పడుతుందని రామ్మోహన్ నాయుడు కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎంపీగా గెలిచినా ఢిల్లీలో పార్టీ తరఫున పెద్దగా పోరాడేమీలేదని.అదే ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి పదవి కూడా సాధించొచ్చని రామ్మోహన్ నాయుడు అభిప్రాయపడుతున్నట్లు టాక్ నడుస్తోంది.2014 ఎన్నికలకు ముందు వరకు టీడీపీ కేడర్ అంతా రామ్మోహన్ చుట్టూ తిరిగేదని.ఆ ఎన్నికల్లో గెలిచి అచ్చెన్నాయుడు మంత్రి అయ్యాక అంతా అటు వైపు వెళ్లిపోయారని రామ్మోహన్ నాయుడు కుటుంబంలో చర్చ జరుగుతోంది.
రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యేగా గెలిస్తే బాబాయ్ అచ్చెన్నాయుడికి చెక్ పడటం గ్యారంటీ అని టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.రామ్మోహన్‌కు ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది.
ఒకవేళ టీడీపీ గెలిస్తే మంత్రి పదవి రామ్మోహన్‌కు వస్తే హోంమంత్రి కావాలన్న అచ్చెన్నాయుడి ఆశలకు గండిపడుతుందని టీడీపీ నేతలు చర్చించుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.