రష్యా అధ్యక్షుడు పుతిన్( Putin ) తాజాగా బాహాటంగానే తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.ఉక్రెయిన్‌తో( Ukraine ) యుద్దంలో ఎవరైతే దెబ్బతీయాలని చూస్తున్నారో వారికి తగిన గుణపాఠం చెప్పి తీరుతానని అన్నారు.
ఇక పుతిన్ గతంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మనం చూసాం.కాగా తాజా పరిణామాల వలన మరోసారి ఇలాంటి హెచ్చరికలు చేయడం సర్వత్రా హాట్ టాపిక్ అయింది.
యుద్ధాన్ని చాలా రోజుల పాటు కొనసాగించి, రష్యా( Russia ) వద్ద ఆయుధాలు అయిపోగానే రివర్స్ ఎటాకింగ్ కు దిగి రష్యాను దెబ్బతీయాలనే ప్లాన్ అమెరికా చేస్తున్నట్లు రష్యా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుసుకుంది.
అయితే, అది అంత తేలికైన విషయం కాదని అమెరికా, యూరప్ దేశాలు గుర్తు పెట్టుకోవాలని రష్యా హెచ్చరించడం గమనార్హం.ఈ నేపథ్యంలో అమెరికా, ఉక్రెయిన్ యూరప్ దేశాలు రష్యాను తక్కువ అంచనా వేయొద్దని నిపుణులు చెబుతున్నారు.ఇరాక్ అధ్యక్షుడిలా పుతిన్ ను పట్టుకోవాలని, ఉరి తీయాలని అమెరికా భావిస్తే అంతకన్నా తెలివి తక్కువ తనం ఇంకేమీ ఉండదని మేధావులు అభిప్రాయ పడుతున్నారు.
ఒక వేళ యుద్ద సామగ్రి అయిపోతే అణ్వస్త్ర దాడికి దిగేందుకు కూడా రష్యా ఏ మాత్రం వెనడాదని అభిప్రాయపడుతున్నారు.
ఇకపోతే, ఇన్ని రోజులు యుద్దం కొనసాగడానికి పరోక్షంగా అమెరికా, యూరప్ దేశాలే కారణం.అందువల్లనే రష్యాకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది.దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏయే దేశాలు ఉక్రెయిన్ కు సాయం చేస్తున్నాయో వారందరూ గుర్తు పెట్టుకోవాలని రష్యా హెచ్చరించినట్టు తెలుస్తోంది.
అయితే వారికి సరైన సమయంలో సరియైన గుణపాఠం చెబుతామని పుతిన్ హెచ్చరిస్తున్నారు.అవును, పుతిన్ అణ్వస్త్రాలు ఉన్న దేశానికి నాయకుడు.తనపైకి ఏ మాత్రం ఎదురు దాడి జరిగినా దీటైన జవాబివ్వగల సమర్థుడు.