జగన్ కు అత్యంత నమ్మకస్తుల్లో ఒకరుగా పేరుపొందిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి( MLA Alla Ramakrishna Reddy ) సంచలన నిర్ణయం తీసుకున్నారు.పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు.
ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేయడం ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.అసలు ఆళ్ల రాజీనామాకు కారణాలు ఏమిటి ? జగన్( YS jagan ) పై కోపంతో ఈ నిర్ణయం తీసుకున్నారా లేక జగనే ఆళ్లనే దూరం పెట్టారా ? రాజీనామాకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి ఇలా ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి.వై నాట్ 175 అనే నినాదాన్ని గత కొంతకాలంగా వినిపిస్తున్న జగన్ ఎప్పటికప్పుడు నియోజకవర్గాల వారీగా చోటుచేసుకుంటున్న పరిణామాలు , పార్టీపై వ్యతిరేకత, ఎమ్మెల్యేల వ్యవహార శైలి, వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే గెలుస్తారా లేదా ఇలా అనేక అంశాలపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తున్నారు.
సర్వేలో పనితీరు అంతంత మాత్రమే అన్నట్టుగా ఉన్నవారికి ఎప్పటికి వార్నింగ్ లు ఇచ్చారు. మరి కొంతమందికి వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కే ఛాన్స్ లేదని, మళ్లీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదో ఒక కీలకమైన పదవి తప్పక ఇస్తామని , పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలంటూ జగన్ నచ్చ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది టికెట్ దక్కకపోయినా , పార్టీలో ఉండేందుకు అంగీకరిస్తున్నా, మెజార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు టికెట్ దక్కకపోతే ఎన్నికల సమయంలో ఇతర పార్టీలో చేరేందుకు ఇప్పటికే పార్టీలతో సంప్రదింపులు చేస్తున్నారు .ఇది ఇలా ఉంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాకు కారణాలు చాలానే కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని జగన్ చెప్పడం, అలాగే మంగళగిరి నియోజకవర్గానికి వైసీపీ ఇన్చార్జిగా పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవికి అప్పగిస్తారని ముందుగానే సమాచారం అందడంతో గౌరవంగా తప్పుకుంటేనే మంచిదనే ఆలోచనకు వచ్చి , పార్టీతో పాటు ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు సమాచారం.
గత కొంతకాలంగా ఈ నియోజకవర్గంలో గంజి చిరంజీవి( Ganji chiranjivi )ని జగన్ ప్రోత్సహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో మెజార్టీ సంఖ్యలో ఉన్న పద్మశాలి సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు చిరంజీవికి ప్రయార్టీ ఇస్తున్నారు. అదీ కాకుండా , వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో నుంచి టిడిపి అభ్యర్థిగా నారా లోకేష్ పోటీ చేయబోతున్న నేపథ్యంలో చిరంజీవి అయితేనే సామాజిక వర్గాల లెక్కల్లో ఇక్కడ విజయం సాధిస్తారని, ఆళ్ల అయితే గెలుపు కష్టమేనన్న నివేదికలతో జగన్ ముందుగానే ఆళ్ల కు టికెట్ విషయం లో క్లారిటీ ఇచ్చేసారట.ఈ వ్యవహారాలు నచ్చకే ఆళ్ల రామకృష్ణ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారట.
ఇది ఇలా ఉంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా నేపథ్యంలో ఇక్కడ వైసిపి ఇన్చార్జిగా చిరంజీవికి బాధ్యతలు అప్పగించనున్నారట.