ఏపీలో చంద్రబాబు వరుస పర్యటనలు చేస్తున్నారు.ఒక్కొక్క జిల్లాను టార్గెట్ చేస్తూ చుట్టి వస్తున్నారు.
అంతేనా పోయిన ప్రతి చోట.స్థానిక నాయకులను ఉతికి ఆరేస్తున్నారు.ఎమ్మెల్యే, మంత్రి అనే తేడా లేకుండా విమర్శన అస్త్రాలు సందిస్తు ఉన్నారు.ఆరు పదుల వయసు లోనూ.ఎంతో ఉత్సాహంగా ఉంటు.కేడర్ లో జోష్ నింపుతున్నారు.
తెలుగు తమ్ముళ్లు కూడా.పార్టీ నీ ఎలాగైనా అధికారం లోకి తీసుకు రావాలని.
కష్ట పడుతున్నారు.దాంతో ఒకవైపు కేడర్ మరో వైపు బాబు వచ్చే ఎన్నికలే టార్గెట్ గా పని చేస్తున్నారు.
ఇంకో వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస్ యాత్రకు ప్లాన్ చేస్తుంటే, మరో వైపు నారా లోకేష్ ఏకంగా పాద యాత్రకు ముహూర్తం పెట్టుకున్నారు.సరిగ్గా ఇదే టైమ్ లోనే.
చంద్రబాబు యాత్రలో రెండు దుర్ఘటనలు జరిగాయి.నెల్లూరు జిల్లా కందుకూరు లో జరిగిన ప్రమాదం లో ఏకంగా 9 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటన జరిగి పది రోజులు కాకుండానే.గుంటూరు లో తోపులాట జరిగి.
మరో నలుగురు మహిళలు చనిపోయారు.దాంతో ఆయనపై కొంచం వ్యతిరేకత పెరిగింది.
దాన్ని క్యాష్ చేసుకో డానికి వైసీపీ ప్లాన్ చేస్తోంది.
ఇదే కరెక్ట్ టైమ్ అనుకొని.అన్ని రహదారులు, జాతీయ రహదారుల్లో బహిరంగ సభలకు అనుమతి లేదంటూ జీఓ జారీ చేసింది.దాంతో రాష్ట్రం లోని ప్రతిపక్ష పార్టీలు అన్ని ఒక్కసారిగా మండి పడుతున్నాయి.
చంద్రబాబు, పవన్ మేనియలను.తగ్గించ దానికే ఈ జీఓ తెచ్చారని అంటున్నారు.
నిజానికి ప్రమాదం అని తెలిసిన చోట్ల ముందుగానే ప్రభుత్వ అధికారుల అనుమతి నిరాకరిస్తారు.మరి ఇప్పుడే స్పెషల్ గా జీఓ తేవడం మాత్రం.
కచ్చితంగా రాజకీయ ఉద్దేశం తోనే తెచ్చారని విశ్లేషకులు అంటున్నారు.అయితే ఈ జీఓ ఒక్క ప్రతి పక్షాలకు మాత్రమే కాదని.
వైసీపీ కి కూడా వర్తిస్తుందని.సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పిన.
నేతలు మాత్రం వినడం లేదు.మరి వైసీపీ నిజంగా మట మీద నిలబడుతుందా లేదా అనేది.
ఎన్నికలు వస్తె గానీ అర్థం కాదు.