ఐఏఎస్, ఐపీఎస్( IAS, IPS ) సాధించాలంటే ఏ స్థాయిలో కృషి చేయాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రేయింబవళ్లు కష్టబడితే మాత్రమే ఐఏఎస్, ఐపీఎస్ కావాలనే కల సులభంగా సాధ్యమవుతుంది.
సిమ్రాన్ భరద్వాజ్ సక్సెస్ స్టోరీతో ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.వేర్వేరు ప్రాంతాలలో సిమ్రాన్ తన చదువు ప్రయాణాన్ని సాగించడంతో పాటు ఐపీఎస్ కావాలనే కలను నెరవేర్చుకోవడం గమనార్హం.
సిమ్రాన్ భరద్వాజ్ ( Simran Bhardwaj )సివిల్స్ పరీక్షలు రాసి తన గమ్యాన్ని చేరుకున్నారు.సిమ్రాన్ మాట్లాడుతూ మా స్వస్థలం హరియాణా( Haryana ) అని నాన్న ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో పని చేశారని ఆమె అన్నారు.నాన్న ఉద్యోగం వల్ల వేర్వేరు ప్రాంతాలలో చదువు సాగిందని సిమ్రాన్ భరద్వాజ్ చెప్పుకొచ్చారు.ఢిల్లీలోని కమలానెహ్రూ కాలేజ్ ( Kamal Nehru College, Delhi )లో జర్నలిజం చేశానని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం.
సిమ్రాన్ భరద్వాజ్ ఆ తర్వాత సివిల్స్ పై దృష్టి పెట్టానని చెప్పుకొచ్చారు.ప్రజలకు సేవ చేసేందుకు ఇదే మంచి మార్గమని సిమ్రాన్ పేర్కొన్నారు.2021 సంవత్సరంలో నేను కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ పరీక్షకు హాజరయ్యానని సిమ్రాన్ వెల్లడించడం గమనార్హం.ఆ పరీక్షలో నేను అఖిల్ భారత స్థాయిలో 6వ ర్యాంక్ సాధించానని అన్నారు.
సీడీఎస్ పరీక్షలో మంచి ర్యాంక్ వచ్చినా సివిల్స్ ని వదిలేయలేదని ఆమె కామెంట్లు చేశారు.తాను పట్టుదలగా చదివానని సిమ్రాన్ కామెంట్లు చేశారు.కరోనా లాక్ డౌన్ సమయంలో యూపీఎస్సీ టాపర్ల వీడియోలను చూశానని ఆమె పేర్కొన్నారు.తొలి ప్రయత్నంలోనే సక్సెస్ దక్కి 172వ ర్యాంక్ సాధించానని ఆమె అన్నారు.సిమ్రాన్ భరద్వాజ్ ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారని చెప్పవచ్చు.పోలీసింగ్ లో సమర్థవంతురాలిగా పేరు సంపాదించుకోవాలని తాను భావిస్తున్నానని ఆమె అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.
సిమ్రాన్ సక్సెస్ స్టోరీ ఎంతోమందిని ఆకట్టుకుంటోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.