రష్మిక మనసు బాగోలేకపోతే ఆ పని చేస్తుందా... నిజంగా గ్రేట్ అంటూ?

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి రష్మిక మందన్న( Rashmika Mandanna ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం ఈమె భాషతో సంబంధం లేకుండా వరుస భాషా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

 If Rashmika's Mind Is Not Good, Will She Do That Job, Rashmika Mandanna, Animal-TeluguStop.com

ఇలా ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉండే రష్మిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.ఇక ఏ వ్యక్తికైనా కొన్నిసార్లు కోపం రావడం మూడ్ ఆఫ్ అవ్వడం సర్వసాధారణంగా జరిగే విషయమే.

Telugu Animal, Kollywood, Pushpa-Movie

ఇలా చాలామంది మూడ్ ఆఫ్ అయితే కనుక ఎవరితో మాట్లాడకుండా ఎలాంటి పనులు చేయకుండా గదిలోకి వెళ్లి ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారు.కానీ రష్మిక మనసు కనుక బాగాలేకపోతే ఈమె చేసే పని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.మరి రష్మిక మనసు బాగా లేనప్పుడు ఏం చేస్తుందనే విషయానికి వస్తే ఈమెకు కనుక మనసు బాగా లేకపోతే వెంటనే కిచెన్లోకి వెళ్లి తనకు నచ్చిన ఏదో ఒక రెసిపీ తయారు చేసి అందరికీ వడ్డిస్తారట.ఇలా చిన్నప్పటి నుంచి తనకు వంట చేయడం అలవాటేనని రష్మిక పలు సందర్భాలలో తెలియజేశారు.

Telugu Animal, Kollywood, Pushpa-Movie

షూటింగ్ సమయంలో కూడా ఏమాత్రం విరామం దొరికినా రష్మిక వంట చేసిన నలుగురికి కడుపునిండా భోజనం పెట్టడానికి ఆసక్తి చూపుతారట.ఈ క్రమంలోనే తనకు కోపం వచ్చిన, మనసు బాగా లేకపోయినా ఈమె వెంటనే కిచెన్ లోకి వెళ్లిపోయి వంట చేస్తారనే విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఇలా కోపంలో కూడా వంట చేసి వడ్డిస్తున్నారు అంటే రష్మిక నిజంగా గ్రేట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.ఇక రష్మిక సినిమాల విషయానికొస్తే తాజాగా యానిమల్ ( Animal )సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు ఈమె తెలియజేశారు.

ప్రస్తుతం ఈమె పుష్ప2 సినిమా( Pushpa 2 Movie ) షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube