ప్రకృతిలో ఎన్నో వింతలు దాగున్నాయి.అందమైన జీవులు, చెట్లు, మొక్కలు ఇలా చెప్పుకుంటూ పోతే మనుషులను అబ్బురపరిచే అద్భుతాలు కూడా ఉన్నాయి.
అప్పుడప్పుడు వెలుగులోకి వచ్చే వాటిని చూసినప్పుడు మనం ఆశ్చర్య పోక తప్పదు.తాజాగా మనల్ని ఎంతగానో ఆశ్చర్యపరిచే మరొక అద్భుతమైన జీవి కెమెరాకు చిక్కింది.
దాని పేరు స్ట్రాబెర్రీ స్క్విడ్.ఇది సముద్రంలో నివసించే ఒక జలచరం.
దీని శరీరంపై మిరిమిట్లు గొలిపే వజ్రాలు, రత్నాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది.రంగురంగుల వజ్రాలు పొదిగినట్లు దీని శరీరంపై రెడ్, బ్లూ, గోల్డ్, సిల్వర్ కలర్ డైమండ్స్ లాంటివి కనిపిస్తాయి.
దీని బాడీ షేప్ అచ్చం స్ట్రాబెర్రీ( Strawberry ) లాగానే ఉంటుంది.
అందుకే దానికి ఆ పేరు వచ్చింది.ఈ జీవిని చూసేందుకు చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది.దాని రూపం ముచ్చట గొలుపుతుంది.
ఇది అందర్నీ కట్టిపడేస్తుంది కానీ దాని దగ్గరకు అసలు వెళ్ళకూడదు.ఎందుకంటే అది చాలా ప్రమాదకరమైన జీవి.
ముట్టుకుంటే భారీ హాని కలిగిస్తుంది.శాస్త్రవేత్తలు ఈ జీవికి కాకీడ్ స్క్విడ్( Cockeyed Squid ) అని నామకరణం చేశారు.
అడల్ట్ స్క్విడ్ ఎడమ కన్ను దాని కుడి కన్ను వ్యాసం కంటే రెండింతలు పెద్దదిగా ఉండటం దీనిలోని మరొక ప్రత్యేకత. స్ట్రాబెర్రీ స్క్విడ్( Strawberry Squid ) సముద్రపు అడుగుభాగంలో ఉపరితలం నుంచి 1,000 మీటర్ల లోతులో నివసిస్తుంది.
ఈ అరుదైన, అందమైన జీవికి సంబంధించిన ఫొటోను @venueearth అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ రీసెంట్‌గా షేర్ చేసింది.ఇది షేర్ చేసిన వెంటనే వైరల్ గా మారింది.దీనికి వేలల్లో లైక్స్, కామెంట్స్ వచ్చాయి.ఇది ప్రపంచంలోనే అత్యంత అందమైన జీవి అని ఒకరు కామెంట్ చేశారు.ఇది సహజ సౌందర్యం అని మరొకరు అన్నారు.దీనిని మీరు కూడా చూసేయండి.