మోహన్ బాబు, రాజశేఖర్ వదులుకున్న బ్లాక్ బస్టర్ మూవీ ఏదో మీకు తెలుసా?

ఎం.రాజా డైరెక్షన్ లో తెరకెక్కి 2001 సంవత్సరంలో విడుదలైన హనుమాన్ జంక్షన్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.

 Interesting Facts About Block Buster Hit Movie Hanuman Junction Details, Ten Kas-TeluguStop.com

జగపతిబాబు, అర్జున్, వేణు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు.స్నేహ, లయ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.అయితే ఈ సినిమాకు మొదట ఎంపికైన హీరోలు మాత్రం వీళ్లు కాదు.

మోహన్ బాబు, రాజశేఖర్ ఈ సినిమాలో హీరోలుగా నటించాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల అర్జున్, జగపతిబాబు ఈ సినిమాలో నటించాల్సి వచ్చింది.ఈ సినిమా డైరెక్టర్ మోహన్ రాజా ప్రస్తుతం తెలుగులో గాడ్ ఫాదర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

మోహన్ రాజా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన తెన్ కాశి పట్టణం అనే సినిమాను తెలుగులో తెరకెక్కించారు.

ఈ సినిమాలో నటించడానికి మోహన్ బాబు, రాజశేఖర్ అంగీకరించి అడ్వాన్స్ కూడా తీసుకున్నారు.

అయితే ఆ తర్వాత వాళ్లిద్దరూ తప్పుకొని జగపతిబాబు, అర్జున్ ఈ సినిమాలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.దర్శకుడు మోహన్ రాజా తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎవరికీ తెలియని ఈ విషయాన్ని వెల్లడించారు.తెన్ కాశిపట్టణం లైన్ ను మాత్రమే తీసుకుని మోహన్ రాజా కథలో కీలక మార్పులు చేశారు.

ఆ మార్పుల వల్ల ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా తర్వాత మోహన్ రాజా తెలుగులో ఆఫర్లు వచ్చినా సినిమాలు చేయలేదు.చాలా సంవత్సరాల తర్వాత మోహన్ రాజా తెలుగులో తెరకెక్కిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube