అమెరికాలో ప్రజాస్వామ్యం ఉందా, అసలు బిడెన్ పాలన ఎలా ఉంది, ప్రస్తుత ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు అనే కోణంలో CBS న్యూస్ ఓ సర్వే చేపట్టింది.అయితే ఈ సర్వేలో అడిగిన ప్రశ్నలకు ఊహించని విధంగా సమాధానాలు రావడం, ప్రజలు వారి వారి అభిప్రాయాలను కుండబద్దలు కొట్టేలా చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ముఖ్యంగా డెమోక్రటిక్ పార్టీ పై ఈ సర్వే రిజల్ట్ తీవ్ర ప్రభావం చూపింది.ఇంతకీ ఈ సర్వేలో ఏం తేలిందంటే.
అమెరికాలో క్యాపిటల్ భవనంపై దాడి జరిగిన తరువాత నెలకొన్న పరిస్థితులపై అమెరికన్స్ తీవ్ర ఆందోళన చెందినట్టుగా ఈ సర్వే తేల్చింది.మెజారిటీ అమెరికన్స్ తమ దేశంలో ప్రజాస్వామ్య పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసారట.
ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని ఇందులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే హింసాత్మక ఘటనలను సమర్ధించవచ్చునని మూడో వంతు మంది అమెరికన్స్ మద్దతు తెలిపారట.ఈ సర్వేలకు సంభందించి తాజాగా స్థానిక మీడియా ప్రచురించింది.
అమెరికా ప్రజా స్వామ్యానికి ముప్పు వాటిల్లిందనే అభిప్రాయాన్ని మూడవ వంతు ప్రజలు ద్రువీకరిస్తున్నారని ప్రచురించింది.అంతేకాదు
అమెరికాలో జాత్యహంకార ధోరణిపై కూడా న్యూస్ పోల్ సర్వే చేపట్టింది.గతంలో అంటే 2002 లో అమెరికాలో జాత్యహంకారం 90 శాతం ఉండేదని, ప్రస్తుతం ఇది 50 శాతానికి తగ్గిందని, తెలిపింది.ప్రభుత్వంపై జరుగుతున్న హింసాత్మక చర్యలను సమర్దించవచ్చునని 38 శాతం మంది తెలిపారట.
అధ్యక్షుడిగా బిడెన్ ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచీ ఆయన ఇచ్చిన హామీలు అమలు అయ్యాయా లేదా అనే విషయంపై మెజారిటీ ప్రజలు మద్దతు ఇవ్వలేదని, అంతేకాదు బిడెన్ చట్టబద్దంగా ఎన్నికోబడిన అధ్యక్షుడు కాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేసారట.అయితే బిడెన్ ప్రభుత్వ పాలన తీసిపారేయాల్సిన అంత చెత్తగా లేదని, కానీ తన హామీల విషయంలో మాత్రం బిడెన్ అలసత్వం చూపుతున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట.