ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ బదిలీలపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కు ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేసి మిగిలిన వారికి కూడా ఆదేశాలు ఇవ్వాలని కేంద్రం కోరింది.
అయితే సోమేశ్ కుమార్ కు ఇచ్చిన ఉత్తర్వులు వేరు తమ అభ్యర్థన వేరని బ్యూరో క్రాట్స్ పేర్కొంది.ఈ నేపథ్యంలో 13 మంది బ్యూరో క్రాట్స్ లో ఏడుగురికి మాత్రమే వ్యత్యాసం ఉందని కేంద్రం తరపు న్యాయవాది తెలిపారు.
మిగిలిన ఆరుగురు బ్యూరో క్రాట్స్ కు సోమేశ్ కుమార్ ఉత్తర్వులే వర్తిస్తాయని కేంద్ర ప్రభుత్వ తరపు న్యాయవాది వెల్లడించారు.ఈ నేపథ్యంలో వాదనలు వినిపించేందుకు బ్యూరో క్రాట్స్ కోర్టును సమయం కోరారు.
దీంతో తెలంగాణ హైకోర్టు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.