ఉపాధ్యాయుల బదిలీలపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఏ ఆధారంతో బదిలీల్లో టీచర్ల మధ్య వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
టీచర్ ను పెళ్లి చేసుకుంటేనే బదిలీ చేస్తామంటే ఎలా అని హైకోర్టు ప్రశ్నించింది.దీనిపై స్పందించిన ప్రభుత్వం భార్యాభర్తలు ఒకే చోట ఉండాలన్నదే తమ ఉద్దేశమని ధర్మాసనానికి తెలిపింది.
ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు ఇచ్చినట్లు అదనపు ఏజీ తెలిపారు.బదిలీల నిబంధనలను సవరించామని ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది.
ఈ నేపథ్యంలో నిబంధనల సవరణలను ఈనెల 4, 5 వ తేదీల్లో అసెంబ్లీ, కౌన్సిల్ ముందు ఉంచుతామన్న అదనపు ఏజీ నిబంధనలో మార్పులపై హైకోర్టుకు మెమో సమర్పించారు.మెమో, కౌంటర్లపై కొంత సమయం ఇవ్వాలని పిటిషనర్లు కోరారు.
ఫిబ్రవరి 14 నుంచి స్టే ఉన్నందున బదిలీల ప్రక్రియ నిలిచి పోయిందని, ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో త్వరగా విచారణ జరపాలని అదనపు ఏజీ కోరారు.ఈ క్రమంలో టీచర్ల బదిలీలపై ఈనెల 23న వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది.