గతేడాది కెనడాలో ( Canada ) జరిగిన కాల్పుల ఘటనలో ప్రాణాలతో బయటపడిన భారత సంతతి సిక్కు మహిళ అక్కడి పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.పోలీస్ సిబ్బంది తమ డ్యూటీని సక్రమంగా నిర్వర్తించలేదని.
తన తల్లిదండ్రులు తన కళ్లెదుటే చనిపోవడాన్ని చూశానని జస్ప్రీత్ కౌర్ సిద్ధూ ( Jaspreet Kaur Sidhu )ఆరోపించారు.జగ్తార్ సింగ్ సిద్ధూ, హర్భజన్ కౌర్‌లు అంటారియో ప్రావిన్స్‌లోని కాలెడాన్ బ్రాంప్టన్( Caledon Brompton ) సరిహద్దుల్లో ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.
ఈ క్రమంలో గతేడాది నవంబర్ 20 అర్థరాత్రి ఈ దంపతులపై దుండగులు కాల్పులు జరిపారు.ఈ ఘటనలో సిద్ధూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.
హర్భజన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన జస్ప్రీత్ కౌర్. హాస్పిటల్ బెడ్ నుంచి సీబీసీ న్యూస్‌తో మాట్లాడుతూ.ఓ దుండగుడు తన ఇంటిలోకి చొరబడి కాల్పులు జరిపాడని పేర్కొన్నారు.
తన కళ్లెదుటే తన తండ్రిని కాల్చి చంపారని, తన తల్లి చివరి అరుపులు విన్నానని ఆ కాసేపటికీ ఆ ప్రాంతంలో నిశ్శబ్ధం ఆవరించిందని జస్ప్రీత్ కన్నీటీ పర్యంతమయ్యారు.స్పృహలోకి వచ్చిన వెంటనే 911కి కాల్ చేశానని ఆమె గుర్తుచేసుకున్నారు.
ఈ దారుణం జరిగి దాదాపు రెండు నెలలు కావొస్తున్నా పోలీసులు ఇంకా కేసును విచారిస్తూనే వున్నారని , ఇంకా ఆధారాలు లభించలేదని చెబుతున్నారని జస్ప్రీత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై దర్యాప్తును ప్రారంభించిన అంటారియో ప్రావిన్షియల్ పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేదన్నారు.ఎవరూ మమ్మల్ని సంప్రదించలేదన్నారు.ఇప్పటి వరకు పలువురు అధికారులకు 2 వేలకు పైగా ఈ మెయిల్స్ పంపామని ఎవరూ సమాధానం చెప్పలేదని జస్ప్రీత్ దుయ్యబట్టారు.
తానిప్పుడు బలహీనంగా కనిపించినా ఉక్కు సంకల్పంతో న్యాయం జరిగే వరకు పోరాడుతూనే వుంటానని ఆమె స్పష్టం చేశారు.ఇవాళ ఈ ఘటన మనకు జరిగితే రేపు మరో కుటుంబంలో జరగవచ్చునని జస్ప్రీత్ పేర్కొన్నారు.
జస్ప్రీత్ ఆమె సోదరుడు గుర్దిత్ సింగ్‌లు కొన్నేళ్ల క్రితం కెనడాకు విద్యార్ధులుగా వచ్చారు.