ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ 38వ వర్ధంతి వేడుకలను ఘనంగా మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి నిర్వహించారు.ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ ఇందిరమ్మ ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు .

 Indira Gandhi 38th Death Anniversary At Yellareddy Peta Congress Party Office, I-TeluguStop.com

ప్రతి పేదవాడికి కూడు గుడ్డ ఇంటిని అందించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు.ఈ నినాదాన్ని ఇందిరాగాంధీ అప్పుడే పేద ప్రజల దగ్గరికి తీసుకురావడం జరిగిందన్నారు.

పేదల కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసి ప్రపంచంలోనే శక్తివంతమైన మహిళగా గుర్తింపు తెచ్చుకోవడం జరిగిందన్నారు .ఎమర్జెన్సీలో సైతం ధైర్యవంతరాలుగా పేరు తెచ్చుకోవడం జరిగిందన్నారు .ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు .ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి పసుల కృష్ణ కార్యదర్శి లింగం గౌడ్ ,నాయకులు గంట బుచ్చగౌడ్ ,కొత్తపల్లి దేవయ్య, సూడిద రాజేందర్ ,బిపేట రాజు , మాజీ ఎంపిటిసి ఒగ్గు బాలరాజు యాదవ్,తిరుపతి గౌడ్ ,అనవేని రవి ,మొగుళ్ళ మధు ,ఎండి ఇమామ్ , భూపాల్ రెడ్డి, దేవరాజ్ , నర్సింలు ,బాలయ్య, గణపతి , అంజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube