అమ్మ అంటే పిల్లలని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది.పిల్లలకి చిన్న గాయం అయినా తల్లడిల్లి పోతుంది.
తినడానికి తమకి లేకపోయినా ఆమె పస్తులు ఉండయినా వారికి కడుపునిండా అన్నం పెడుతుంది.సృష్టిలో తల్లికి మించిన దైవం లేదు అంటారు.
మాట గొప్ప స్థానం తల్లికి ఉంటుంది.అయితే కొందరు మాత్రం తల్లి అనే పదానికే మచ్చ తెస్తున్నారు.
వారికి ఉన్న స్వార్ధానికో, మరేదైనా కారణాలతో తాము తల్లులమనే విషయాన్ని మరిచి పిల్లలపై దారుణాలకి పాల్పడుతున్నారు.అమెరికాలో జరిగిన ఓ సంఘటన వింటే మనసుని కలిచి వేస్తుంది.
ఇది అసలు తల్లేనా అనే సందేహం వస్తుంది
అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఓ తల్లి తన ఐదేళ్ళ కొడుకుని వాషింగ్ మెషిన్ లో వేసింది ఏమి తెలియనట్టుగా మెషిన్ ఆన్ చేసిన ఆమె తన పని తానూ చూసుకుంటూ ఉండగా అతడి భర్త ఇంటికి వచ్చాడు.ఈ లోగా మెషిన్ లోపలి నుంచీ అరుపులు రావడం గమనించిన అతడు ఏముందోనని చూడగా కొడుకు మెషిన్ లోపల గాయాలతో కనిపించాడు.
దాంతో కంగారు పడిన అతడు హుటాహుటిన ఆసుపత్రికి తరలించాడు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు తండ్రి వద్ద పూర్తి సమాచారం తెలుసుకుని తల్లిని విచారించగా ఆమె తనకేమి తెలియదని, పిల్లాడు మెషిన్ లోపలి ఎలా వెళ్ళాడోనని అమాయకంగా బదులు ఇచ్చింది.దాంతో మెషిన్ కంపెనీ వారిని సంప్రదించగా పిల్లాడు నేరుగా మెషిన్ లోకి వెళ్ళే అవకాశం ఎట్టిపరిస్థితుల్లోనూ లేదని తేల్చి చెప్పారు.దాంతో పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.