ఉక్రెయిన్ లో నెలకొన్న సంక్షోభం కారణంగా ఎంతో మంది ఉక్రెయిన్ వాసులు పక్క దేశాలకు వలసలు వెళ్ళిపోతున్నారు.ఆయా దేశాలు సైతం ఉక్రెయిన్ వాసులకు రక్షణగా ఉంటూ వారి దేశాలలోకి ఆహ్వానిస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఉక్రెయిన్ లోని భారత ఎంబసీ భారతీయులకు ఎప్పటికప్పుడు కీలక సూచనలు చేస్తూ వారిని సరిహద్దు ప్రాంతాలకు తరలిస్తూ పొరుగు దేశాల సాయంతో భారత్ తీసుకువచ్చేలా అన్ని రకాల చర్యలు చేపడుతోంది.దాంతో ఎంతో మంది భారతీయులు ఉక్రెయిన్ ను వీడుతూ సరిహద్దుల గుండా వేరే దేశాలకు వెళ్లి అక్కడి రాయబార కార్యాలయం ద్వారా సహాయం పొందుతున్నారు అయితే
ఉక్రెయిన్ నుంచీ పోలెండ్ బోర్డర్ లోకి వచ్చే వారికి ఎలాంటి వీసాలు అవసరం లేదని అధికారులు ప్రకటించడంతో పెద్ద ఎత్తున భారతీయ విద్యార్ధులు సరిహద్దుల ద్వారా పోలెండ్ చేరుకుంటున్నారు ఒక్క సారిగా ఈ తాకిడి పెరుగుతూ ఉండటంతో బోర్డర్ వద్ద పహారా కాస్తున్న పోలెండ్ సైనికులు, పోలీసులు భారతీయ విద్యార్ధులపై దాడులకు దిగుతున్నారు.
విద్యార్ధులను అడ్డుకుంటూ వారిని లోనికి ప్రవేశించకుండా హింసిస్తున్నారు.లోనికి వచ్చిన వారిపై దాడులు చేస్తున్నారు.వారిని కాళ్ళతో తన్నుతూ హింసిస్తున్నారు మరొక దారుణం ఏంటంటే
మహిళా విద్యార్ధినులు వారి కాళ్ళకు మొక్కితేనే వారిని పోలెండ్ లోకి అనుమతిస్తున్నారు.తాము చెప్పింది చెప్పినట్టు వినాలని లేదంటే పోలెండ్ లోకి అడుగుపెట్టేది లేదంటూ గట్టిగా అరుస్తూ హెచ్చరిస్తున్నారు.దాంతో భారతీయ విద్యార్ధులు తీవ్ర ఆవేదన చెందుతూ భయాందోళనలకు లోనవుతున్నారు.అసలే ఉక్రెయిన్ లో జరుగుతున్న దాడుల నేపధ్యంలో చదువులు కోల్పోయి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న విద్యార్ధులు పోలెండ్ పోలీసులు చేస్తున్న దాష్టీకంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారని తమిళ నాడుకు చెందిన ఓ విద్యార్ధిని పోలీసుల చర్యలని వీడియో తీసి నెట్టింట్లో పోస్ట్ చేసింది.
దాంతో పోలెండ్ పోలీసులపై నెటిజన్లు మండిపడుతున్నారు.కాగా వారిపై చర్యలు తీసుకోవాలంటూ ట్విట్టర్ లో పోలెండ్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
.