యూకేలో పాడు పని చేస్తూ దొరికిన ఎన్నారై జైలు పాలు..

లండన్‌లో నివసిస్తున్న ఎన్నారై డాక్టర్ కబీర్ గార్గ్( Dr.Kabir Garg ) సైకియాట్రిస్ట్‌గా పని చేస్తున్నాడు.అయితే ఇతడు చేస్తున్న ఒక పాడు పని బట్టబయలు అయింది.దాంతో అతనికి యూకే కోర్టు( UK Court ) ఆరేళ్ల జైలు శిక్ష విధించింది.కబీర్ డార్క్ వెబ్‌లో “ది అనెక్స్”( The Annex ) అనే వెబ్‌సైట్‌కు మోడరేటర్‌గా ఉంటూ దానిని ఆపరేట్ చేస్తున్నాడు.ఇందులో పిల్లల వేధింపులకు సంబంధించిన కంటెంట్ షేర్ అవుతోంది.

 Indian-origin Psychiatrist Dr Kabir Garg Jailed For Running Dark Web Child Abuse-TeluguStop.com

ఈ సైట్‌లో ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 90,000 మంది సభ్యులు ఉన్నారు.వారు రోజూ పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు, వేధింపులకు సంబంధించిన వందలాది లింక్‌లను షేర్ చేస్తున్నారు.

తాను రన్ చేస్తున్న సైట్‌లో పిల్లలపై లైంగిక దాడికి సహకరించడం, పిల్లల అసభ్యకరమైన చిత్రాలను షేర్ చేయడం, నిషేధిత చిత్రాలను కలిగి ఉండటం వంటి అనేక ఆరోపణలను డాక్టర్ గార్గ్ అంగీకరించాడు.యూకే నేషనల్ క్రైమ్ ఏజెన్సీ (NCA) అతనిని సైట్ మోడరేటర్లలో ఒకరిగా గుర్తించింది.

పిల్లలపై నేరాలను పంచుకునే, చర్చించే ఇతర నేరస్థులతో కనెక్ట్ అవ్వడానికి అతను డార్క్ వెబ్‌ను( Dark Web ) ఉపయోగించినట్లు NCA కనుగొంది.

Telugu Child Abuse, Dark Web, Dr Kabir Garg, London, National Agency, Nri, Priso

2022, నవంబర్‌లో డాక్టర్ గార్గ్‌ని లండన్‌లోని అతని నివాసంలోనే పోలీసులు అరెస్టు చేశారు.ల్యాప్‌టాప్, ఇతర పరికరాలను విచారణ కోసం స్వాధీనం చేసుకున్నారు.క్రైమ్ ఏజెన్సీ అతని పరికరాలలో చాట్ లాగ్‌ల వంటి సాక్ష్యాలను కనుగొంది, అది పిల్లల పట్ల అతని ఆసక్తిని, మోడరేటర్‌గా అతని పాత్రను బహిర్గతం చేసింది.

Telugu Child Abuse, Dark Web, Dr Kabir Garg, London, National Agency, Nri, Priso

క్రైమ్ ఏజెన్సీ వెబ్‌సైట్‌ను తీసివేయడానికి యునైటెడ్ స్టేట్స్‌లోని ఎఫ్‌బీఐతో సహా అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేసింది.సైట్‌ను నడుపుతున్న యూఎస్‌లో ఐదుగురు వ్యక్తులను ఎఫ్‌బీఐ అరెస్టు చేసి దోషులుగా నిర్ధారించింది.వారిలో ఒకరికి 28 ఏళ్ల జైలు శిక్ష పడింది. “ది అనెక్స్” ఇప్పుడు యాక్టివ్‌గా లేదు, అయితే ఇది టోర్ అనే డార్క్ వెబ్ బ్రౌజర్‌ని ఉపయోగించి పిల్లల అశ్లీల కంటెంట్ యాక్సెస్ చేయగల సైట్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube