అద్దె కుంభకోణంలో( Rental Scam ) పలువురు విద్యార్ధులను మోసం చేయడమే కాకుండా.తన రూమ్‌మేట్ పాస్‌పోర్టును( Roommates Passport ) ఉపయోగించి సింగపూర్ ( Singapore ) నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన భారతీయుడికి జైలు శిక్ష విధించింది కోర్ట్.
నిందితుడిని పటేల్ ధవల్‌కుమార్ చందూభాయ్‌గా( Patel Dhavalkumar Chandubhai ) గుర్తించారు.ఇతనిపై పాస్‌పోర్ట్ చట్టం సహా పలు అభియోగాలు నమోదు చేసినట్లు ది స్ట్రెయిట్స్ టైమ్స్ వార్తాసంస్థ నివేదించింది.
నేరం అంగీకరించడంతో పటేల్‌కు 14 నెలల 14 వారాల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.
మే 2022లో సింగపూర్‌కు చదువుకోవడానికి వచ్చి వసతి కోసం వెతుకుతున్న నలుగురు బాధితులను ధవల్ మోసం చేశాడు.
ఒక్కొక్కరి నుంచి 500 డాలర్ల అద్దె మొత్తాన్ని పేటేల్ వసూలు చేశాడు.వీరితో ఒప్పందం కుదుర్చుకుని తాను నివసించే యూనిట్‌లో ఒక గదిని అద్దెకు తీసుకున్నాడు.బాధితుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసిన పటేల్.తాను మలేషియా టూర్‌కు వెళ్తున్న సాకుతో యూనిట్ నుంచి అదృశ్యమయ్యాడు.
ఈ లోగా ఇంటి యజమాని.పటేల్ తమకు నెలవారీ అద్దె చెల్లించడం లేదని బాధితులతో చెప్పాడు.
అంతేకాదు.వారిని కూడా తక్షణం బయటకు వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు.
దీంతో తాము మోసపోయినట్లు గ్రహించిన ఈ నలుగురు బాధితులు పటేల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మే 29న పటేల్ సింగపూర్ నుంచి భారత్‌కు పారిపోయేందుకు ప్రయత్నించగా.చాంగి విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు.తన పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేసి .జూన్ 3న బెయిల్‌పై విడుదలయ్యాడు.ఈ సందర్భంగా తమ అనుమతి లేకుండా సింగపూర్ అధికార పరిధి నుంచి బయటకు వెళ్లకూడదని షరతులు విధించింది కోర్ట్.
అయితే ఈ ఏడాది మార్చిలో అతని రూమ్‌మేట్ కొత్త మొబైల్ ఫోన్ కొనాలనుకుంటున్నట్లు చెప్పాడు.దీంతో పటేల్ అతనిని పాస్‌పోర్ట్‌ను తీసుకురావాలని కోరాడు.
మార్చి 20న దేశం విడిచి వెళ్లే ప్రయత్నంలో తువాస్ చెక్‌పాయింట్‌లోని ఆటోమేటెడ్ పాస్‌పోర్ట్ కౌంటర్‌లో పటేల్ తన రూమ్‌మేట్ పాస్‌పోర్ట్‌ను ఉపయోగించాడు.ఈ సమయంలో అతని ఫేస్, కనుపాప, ఫింగర్ ప్రింట్‌లు అసలు పాస్‌పోర్ట్ హోల్డర్‌తో సరిపోలకపోవడంతో అక్కడి అధికారులు ఇమ్మిగ్రేషన్ విభాగానికి ఫిర్యాదు చేశారు.సింగపూర్ చట్టాల ప్రకారం.ప్రయాణం లేదా గుర్తింపు కోసం వేరొకరి పేరు మీద జారీ చేసిన గుర్తింపు పత్రాలను ఉపయోగించినట్లయితే గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, 10 వేల సింగపూర్ డాలర్ల జరిమానా లేదా రెండూ విధించవచ్చు.