మరో పది రోజుల్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన భారతీయ కమ్యూనిటీ( Indian Community ) ఎటు వైపు మొగ్గు చూపుతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.వారిని మచ్ఛిక చేసుకునేందుకు డెమొక్రాట్లు, రిపబ్లికన్లు కిందా మీదా పడుతున్నారు.
అయితే ఈసారి ఇండియన్ కమ్యూనిటీ రెండు పార్టీల మధ్య విడిపోయిందని విశ్లేషకులు అంటున్నారు.తమ సమస్యలు పరిష్కరించిన వారికే తమ మద్ధతు ఉంటుందని కొందరు కమ్యూనిటీ నేతలు తేల్చిచెబుతున్నారు.
దశాబ్ధాలుగా భారతీయులు డెమొక్రాట్ల వైపే మొగ్గుచూపారు.దీనికి డెమొక్రాట్ల( Democrats ) ఉదారవాద భావాలు, ఇమ్మిగ్రేషన్ సంస్కరణలు, సామాజిక ప్రగతిశీల వైఖరి కారణమని అంటారు.తాజాగా ఆసియన్ అమెరికన్ లీగల్ డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ చేసిన సర్వే ప్రకారం .2020లో దాదాపు 74 శాతం మంది భారతీయ అమెరికన్లు( Indian Americans ) డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్ధి జో బైడెన్‌కు ఓటేశారని అంచనా.
ప్రస్తుతం భారత సంతతికే చెందిన కమలా హారిస్( Kamala Harris ) అధ్యక్ష బరిలో నిలవడం, అది కూడా డెమొక్రాట్ పార్టీ నుంచే కావడం చర్చనీయాంశమైంది.భారతీయ కమ్యూనిటీ ఖచ్చితంగా కమల వైపే ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ప్రస్తుతం అమెరికాలోని భారతీయులను కొన్ని అంశాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.ఇమ్మిగ్రేషన్, ఫారిన్ పాలసీ అండ్ యూఎస్ ఇండియా రిలేషన్స్, ఎకానమీ అండ్ స్మాల్ బిజినెస్ కాన్సర్న్స్ , గన్ కల్చర్ వంటివి వీటిలో కొన్ని.
భారతీయ సమాజం రెండు పార్టీల మధ్య విడిపోయినప్పటికీ .ఇప్పటికీ డెమొక్రాట్లు ప్రవాస భారతీయులలో గణనీయమైన పట్టును కలిగి ఉన్నారు.ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ ఇటీవల నిర్వహించిన పోల్‌లో భారతీయ అమెరికన్లు డెమొక్రాట్ల వైపే ఉన్నారని తేలింది.కోవిడ్ అనంతరం ఆర్ధిక వ్యవస్ధను గాడిలో పెట్టడం, ఆరోగ్య సంరక్షణలో పెట్టుబడులు, జాతి వివక్షపై పోరాటం వంటి చర్యలు కమలా హారిస్ ప్రతిష్టను పెంచాయి.
అయినప్పటికీ ఎన్నికల వరకు భారతీయ కమ్యూనిటీపై పట్టు కోల్పోకుండా ఆమె బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.