మామూలుగా ఆన్లైన్ వేదికగా కావచ్చు లేదంటే బయట పబ్లిక్ లో కావచ్చు ఒక హీరో అభిమానులు మరొక హీరో అభిమానులతో పోట్లాడుకోవడం కొట్టుకోవడం ఒకరినొకరు చంపుకోవడం వల్ల కూడా వెళ్తూ ఉంటారు.హీరోలపై ఉన్న అభిమానంతో ఎదుటి వ్యక్తిని చంపడానికి కూడా కొట్టడానికి కూడా వెనకాడారు కొంతమంది.
అలా ఒక హీరో అభిమానులు, మరో హీరో అభిమానులతో గొడవ పడిన ఘటనలు చూస్తుంటాం.అయితే ఒకే హీరోకి చెందిన అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్న ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి.
అలాంటి అరుదైన ఘటనే భీమవరంలో ప్రభాస్ అభిమానుల( Prabhas fans ) మధ్య జరిగింది.మామూలుగా డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ చాలా కూల్ గా ఉంటారని చెప్పాలి.మరి అలాంటిది రెండు వర్గాలుగా విడిపోయి ఎందుకు కొట్టుకున్నారు అన్న వివరాల్లోకి వెళితే.ముఖ్యంగా భీమవరం( Bhimavaram )లో ప్రభాస్ కి ఉండే క్రేజే వేరు.ఆయన సినిమా వచ్చినా, బర్త్ డే వచ్చినా సెలెబ్రేషన్స్ ఒక రేంజ్ లో ఉంటాయని చెప్పాలి.అయితే తాజాగా అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు( Prabhas birthday ) సందర్భంగా అంతకు ముందు రోజు అనగా 22వ తేదీ నుంచి వేడుకలను మొదలు పెట్టేశారు ప్రభాస్ అభిమానులు.
ఈ క్రమంలో ప్రభాస్ అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి గొడవపడ్డారు.భీమవరంలో ప్రభాస్ ఫ్యాన్స్.
సాహో, వాసు వర్గాలుగా విడిపోయి దారుణంగా కొట్టుకున్నారు.
ప్రభాస్ బర్త్ డే వేడుకలను సాహో వర్గం ప్లాన్ చేయగా ఫేక్ ఫ్యాన్స్ అంటూ వాసు వర్గం కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది.నడిరోడ్డు మీదే ఇరు వర్గాలు దాడి చేసుకున్నారు.
ఈ దాడిలో కొందరికి గాయాలు కూడా అయ్యాయి.అలాగే పలు వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయట.
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇంకా కొంతమంది ప్రభాస్ అభిమానులు ఇలా చేసి మీరు ప్రభాస్ కి చెడ్డ పేరు తెస్తున్నారు.ప్రభాస్ అలా మిమ్మల్ని పోట్లాడుకోమని చెప్పారా అంటూ కామెంట్ చేస్తున్నారు.
మరి ప్రభాస్ ఈ విషయంపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.