సాధారణంగా ఒక సంవత్సరంలో కోటి రూపాయలు సంపాదించడమే కాదను అలాంటిది ఒక మహిళ మూడు సంవత్సరాల్లో ఏకంగా రూ.563 కోట్లు సంపాదించింది.ఈ విషయం చాలా మందికి ఆశ్చర్యంగా కలిగించింది.ఎందుకంటే, ఒక యువతి ఇంత తక్కువ వయసులోనే ఇంత భారీగా సంపాదించడం చాలా అరుదు.ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో చాలా చర్చకు దారితీసింది.కొంతమంది ఆమెను అభినందిస్తున్నారు.
మరికొంతమంది ఆమె చేసిన పనిని విమర్శలు చేస్తున్నారు.ఇంతకీ ఆమె ఎవరంటే ఓన్లీఫాన్స్ స్టార్ కొరిన్నా కోప్.
( Corinna Kopf )
ఓన్లీఫాన్స్( OnlyFans ) అనేది అడల్ట్ ప్లాట్‌ఫామ్.ఇక్కడ అమ్మాయిలు తమకు సంబంధించిన ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకుంటారు.
అయితే ఈ ముద్దుగుమ్మ ఓన్లీఫాన్స్ అకౌంట్‌ను మూసివేస్తూ, త్వరలో ఈ ప్లాట్‌ఫామ్‌ను వీడబోతున్నట్లు తెలిపారు.ఈ మూడున్నరేళ్లలో ఆమె ఓన్లీఫాన్స్ ద్వారా రూ.563 కోట్లు సంపాదించింది.అంటే, ప్రతి రెండు రోజులకు రూ.8.41 కోట్లు సంపాదించినట్లు లెక్క.ఆమె నెలవారీ ఆదాయం కూడా అంతే ఆశ్చర్యంగా ఉంది.అత్యధికంగా ఒక నెలలో రూ.198.7 కోట్లు సంపాదించింది.
కొరిన్నా కోప్ అనే యువతి తన సోషల్ మీడియా జీవితాన్ని 2011లో ట్విట్టర్‌తో ప్రారంభించింది.ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్,( Instagram ) యూట్యూబ్( Youtube ) లాంటి ఇతర ప్లాట్‌ఫామ్‌లకు వెళ్లింది.ఓన్లీఫాన్స్లో చేరే ముందు ఆమె తన స్నేహితులతో గడుపుతున్న క్షణాలు, తాను కొన్న బట్టలు, తన ఇంటిని చూపిస్తూ యూట్యూబ్ వీడియోలు చేసేది.యూట్యూబ్‌లో 2016 నుంచి వీడియోలు పోస్ట్ చేయడం మానేసింది.
ఓన్లీఫాన్స్ లింక్‌ను తొలగించినప్పటికీ, ఇప్పుడు తన ట్విట్టర్ బయోలో “వాన్నబీ స్ట్రీమర్” అని రాసుకుంది.ఇన్‌స్టాగ్రామ్‌లో 6.5 మిలియన్ల మంది, ట్విట్టర్లో 3 మిలియన్ల మంది, యూట్యూబ్‌లో మిలియన్ కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు.
కొరిన్నా కోప్ మొదటగా డేవిడ్ డొబ్రిక్ అనే యూట్యూబర్ గ్రూప్‌లో చేరి పాపులర్ చెందింది.ఆ తర్వాత లొగాన్ పాల్ అనే ఓ సోషల్ మీడియా స్టార్‌ను ప్రేమించింది.ఇటీవల ఆమె అదీన్ రాస్ అనే వ్యక్తి లొగన్ పాల్ కంటే మంచివాడని చెప్పడం చాలా చర్చనీయాంశమైంది.
ఓన్లీఫాన్స్ను వదిలేస్తున్నట్లు చెప్పడంతో చాలా మంది ఆమె గురించి కామెంట్లు చేశారు.కొంతమంది ఆమె ఓన్లీఫాన్స్లో అత్యుత్తమమైనదని, మరికొందరు ఆమె మియా కలిఫా లాంటిదని అన్నారు.మరికొందరు ఆమె ఇప్పుడు చాలా డబ్బు సంపాదించి విశ్రాంతి తీసుకుంటుందని, ఆమె భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు.