టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) గురించి మనందరికీ తెలిసిందే.పుష్ప సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్.
పుష్ప సినిమాలో నటనకు గాను జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.ఈ సినిమాకు సీక్వెల్ గా రూపొందిన పుష్ప 2 మూవీ( Pushpa 2) త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
డిసెంబర్ లో ఈ సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే.అ సంగతి పక్కన పెడితే ఈ సినిమా తర్వాత టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.

తాజాగా ఆ సినిమా గురించి నిర్మాత నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేసి అల్లు అర్జున్ అభిమానుల్లో జోష్ నింపారు.ఈ సందర్భంగా నిర్మాత నాగ వంశీ( Naga vamsi ) మాట్లాడుతూ. అల్లు అర్జున్, త్రివిక్రమ్ ల సినిమా స్క్రిప్ట్ పనులు చివరిదశలో ఉన్నాయి.పుష్ప 2 పూర్తి అయ్యాక దీని వివరాలు వెల్లడిస్తాము.జనవరిలో స్పెషల్ ప్రోమోతో సినిమాను ప్రకటిస్తాము.అలాగే మార్చి నుంచి షూటింగ్ ప్రారంభిస్తాము.
మార్చిలోనే అల్లు అర్జున్ చిత్రీకరణలో పాల్గొంటారు.ఇప్పటివరకు రాజమౌళి( Rajamouli ) ఎన్నో గొప్ప సినిమాలు చేశారు.
ఆయన కూడా టచ్ చేయని జానర్ లో ఈ సినిమా ఉంటుంది.మంచి విజువల్స్ కూడా ఉంటాయి.
ఇప్పటి వరకు దేశంలో ఎవరూ చూడని కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నాము.

ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని రూపొందిస్తున్నాము అని చెప్పుకొచ్చారు నాగ వంశీ.అందుకు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అల్లు అర్జున్ అభిమానులు ఈ సినిమాపై అంచనాలను పెంచేసుకుంటున్నారు.దానికి తోడు జక్కన్న కూడా టచ్ చేయని జానర్ అని చెప్పడంతో , ఆ జానర్ ఏది? సినిమా ఎలా ఉండబోతోంది? అనే విషయాల గురించి అనేక రకాల చర్చలు నడుస్తున్నాయి.మొత్తానికి నాగ వంశీ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న ప్రాజెక్టు పై అంచనాలను పెంచేశారు.







