అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేస్తున్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి( Vivek Ramaswamy ) స్పీడ్ పెంచారు.ఇప్పటికే ఫండ్ రైజింగ్, ఇంటర్వ్యూలు, ర్యాలీల విషయంలో జోరు పెంచారు.
తొలి రిపబ్లికన్ ప్రైమరీ డిబేట్ తర్వాత ఆయన గ్రాఫ్ మరింత పెరిగింది.ఆ మరుసటి రోజు నుంచి వివేక్‌కు విరాళాలు కూడా బాగా పెరిగాయి.
ఇదిలావుండగా.అమెరికన్ విదేశాంగ విధానంపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వివేక్ రామస్వామి.
చైనా, తైవాన్‌లపై అమెరికా ఆర్ధికంగా ఆధారపడటాన్ని తగ్గించేందుకు భారత్, దక్షిణ కొరియా, జపాన్‌లతో బలమైన సంబంధాలను పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
గత వారం జరిగిన తొలి రిపబ్లికన్ ప్రెసిడెంట్ ప్రైమరీ డిబేట్ తర్వాత పోల్ సర్వేల్లో ముందంజలో వున్న వివేక్ రామస్వామి తన ప్రణాళికలు, విదేశాంగ విధానంపై తన అభిప్రాయాలను వివరించారు.
అంతేకాదు.విదేశాంగ విధానంపై తనకు అనుభవరాహిత్యం వుందన్న మరో భారతీయ అమెరికన్ రిపబ్లికన్ అభ్యర్ధి నిక్కీ హేలీ( Nikki Haley )పైనా ఆయన విరుచుకుపడ్డాడు.తైవాన్‌తో భవిష్యత్తులో వివాదం ఏర్పడినప్పుడు మలక్కా జలసంధిని మూసివేయడానికి భారత్ నిబద్ధతతో పనిచేస్తుందన్నారు.అమెరికా సెమీ కండక్టర్ల విషయంలో స్వావలంభన సాధించే వరకు తైవాన్‌ను కాపాడుకోవాలని వివేక్ రామస్వామి సూచించారు.
అమెరికన్ జీవన విధానం తైవాన్‌లో తయారు చేయబడిన సెమీకండక్టర్లపై ఆధారపడి వుంటుందని ఆయన చెప్పారు.
కాగా.గత వారం జరిగిన తొలి ప్రెసిడెన్షియల్ ప్రైమరీ డిబేట్ తర్వాత మాజీ సౌత్ కరోలినా గవర్నర్ నిక్కీ హేలీకి ప్రజాదరణ పెరిగింది.అయితే ఈ సమయంలో నిక్కీ, వివేక్‌లు మాత్రం తొలి డిబేట్‌లో కత్తులు దూసుకున్నారు.30 సెకన్ల పాటు బిగ్గరగా అరుస్తూ.వేళ్లూ చూపిస్తూ వార్నింగ్ ఇచ్చే వరకు వెళ్లారు.
విదేశాంగ విధానాలపై వివేక్‌కు అవగాహన లేదని నిక్కీ పదునైన విమర్శలు చేశారు.ఉక్రెయిన్‌ను రష్యాకు అప్పగించాలని ఆయన చెబుతున్నారని.
తైవాన్( Taiwan )ను చైనా మింగేయాలని , ఇజ్రాయెల్‌కు సాయం ఆపేయాలని అంటున్నారని మిత్రదేశాల పట్ల ఇలాంటి వైఖరి మంచిది కాదని నిక్కీ హేలీ అన్నారు.
అయితే ఆమె వ్యాఖ్యలకు గట్టి కౌంటరిచ్చారు వివేక్ రామస్వామి.ఉక్రెయిన్‌కు అమెరికా అధిక సాయం అందించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు.రక్షణ రంగానికి చెందిన కొన్ని కంపెనీల కారణంగా నిక్కీ ఉక్రెయిన్‌కు మద్ధతు తెలుపుతున్నారని వివేక్ ఆరోపించారు.