అమెరికా : మోంట్‌గోమేరీ కౌంటీ కమీషనర్ పదవికి అడుగు దూరంలో భారతీయుడు.. !!

భారతీయ అమెరికన్ న్యాయవాది, విద్యావేత్త నీల్ మఖిజా మోంట్‌గోమేరీ ( Neil Makhija )కౌంటీ కమీషనర్ పదవికి డెమొక్రాటిక్ నామినేషన్‌ను గెలుచుకున్నారు.తద్వారా పెన్సిల్వేనియా రాష్ట్రంలో అత్యున్నత పదవిని అందుకున్న తొలి ఆసియా అమెరికన్‌గా నిలిచేందుకు ఆయన మరింత దగ్గరయ్యారు.

 Indian-american Neil Makhija Wins Democratic Nomination For Top Post In Us Count-TeluguStop.com

పెన్సిల్వేనియాలో అతిపెద్ద ఆసియా అమెరికన్ సంతతిని కలిగిని మోంట్‌గోమెరీ కౌంటీ( Montgomery County ) కమీషనర్ పదవి కోసం మంగళవారం జరిగిన డెమొక్రాటిక్ ప్రైమరీ ఎన్నికల బరిలో ఆయన నిలిచారు.అంతకుముందు బుధవారం తనకు డెమొక్రాటిక్ నామినేషన్‌ దక్కిందని మఖిజా ట్వీట్ చేశారు.

తన బృందం, మద్ధతుదారులు లేకుండా ఇవేవీ జరగవని.అందుకు తాను ఎంతో కృతజ్ఞుడనని, అందరం కలిసి చరిత్ర సృష్టించామని మఖిజా పేర్కొన్నారు.

Telugu Aruna Miller, Democratic, Indian American, Neil Makhija, Pennsylvania, Co

భారత్‌లోని సింధి కుటుంబానికి చెందిన మఖిజా.8,65,000 మంది జనాభాతో పెన్సిల్వేనియా( Pennsylvania )లో మూడవ అతిపెద్ద కౌంటీగా వున్న మోంట్‌గోమేరీ కమీషనర్ పదవికి గాను నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.ఈ ఎన్నికల్లో మఖిజా విజయం సాధిస్తే.ఈ పదవిని అందుకున్న తొలి దక్షిణాసియా వ్యక్తిగా నిలుస్తారు.మరోవైపు.మోంట్‌గోమేరీ కమీషనర్ పదవికి డెమొక్రాటిక్ నామినీని అందుకున్నందుకు గాను ఆయనకు భారత సంతతికి చెందిన అరుణా మిల్లర్( Aruna Miller ) శుభాకాంక్షలు తెలిపారు.

ఈమె మేరీల్యాండ్‌కు తొలి భారతీయ అమెరికన్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

Telugu Aruna Miller, Democratic, Indian American, Neil Makhija, Pennsylvania, Co

మోంట్‌గోమేరీ కౌంటీ కమీషన్ అనేది జిల్లాల వారీగా ఎన్నికైన ఐదుగురు సభ్యులతో కూడిన మోంట్‌గోమేరీ కౌంటీ పాలకమండలి.ప్రతి కమీషనర్ నాలుగేళ్లకోసారి ఎన్నుకోబడతారు.వీరు 45000 మంది సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తారు.

నీల్ మఖిజా ఎన్నికైతే ఇతర కమీషనర్‌లతో పాటు 500 మిలియన్ డాలర్లకు పైగా వున్న కౌంటీ బడ్జెట్‌ను నిర్వహించడంతో పాటు ఎన్నికలు, కోర్టులు, డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం, ప్రజారోగ్య విభాగాలు, ప్రజా మౌలిక సదుపాయాలతో పాటు 3000 మంది ఉద్యోగుల విధులను పర్యవేక్షిస్తారు.కౌంటీ కమీషనర్లు 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల నిర్వహణను కూడా పర్యవేక్షిస్తారు.

నీల్ మఖిజా గతంలో వైట్‌హౌస్, సెనేట్‌లలో పనిచేశారు.హోరేస్ లెంట్జ్ స్కాలర్‌షిప్‌పై హార్వర్డ్ లా స్కూల్‌లో జేడీని సంపాదించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube