నీరా టాండన్ నియామకంపై ఉత్కంఠ.. రంగంలోకి వైట్‌హౌస్, భారతీయ సమాజం

వైట్‌హౌస్ ముఖ్యవ్యూహకర్తల్లో ఒకరిగా ఎంపికైన భారతీయ అమెరికన్ నీరా టాండన్ నియామకం ఆగమ్యగోచరంగా మారింది.అధ్యక్షుడు బైడెన్ మద్దతు ఉన్నప్పటికీ టాండన్.

 Indian-american Neera Tanden To Lead Us Budget Department: White House,indian-am-TeluguStop.com

సెనేటర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ (ఓఎంబీ)కి డైరెక్టర్ పదవి చేపట్టడంపై రిపబ్లికన్లు సహా సొంత పార్టీకి చెందిన పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

సామాజిక మాధ్యమాల్లో నీరా వ్యవహార శైలి సరిగా లేదని ముగ్గురు రిపబ్లికన్లు, ఓ డెమొక్రాట్ బహిరంగంగానే విమర్శించారు.ఆమె నియామకం ప్రక్రియ ప్రారంభం అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు వెయ్యికి పైగా ట్వీట్లను తన ఖాతా నుంచి డిలీట్ చేశారని వారు ఆరోపించారు.

దీనిపై ఇదివరకే నీరా సెనేటర్లను క్షమాపణ కూడా కోరారు.అయితే వైట్‌హౌస్, భారతీయ అమెరికన్ సమాజం మాత్రం ఆమెకు గట్టి మద్ధతునిస్తున్నాయి.ఈ పదవిని నిర్వహించేందుకు అన్ని అర్హతలు నీరాలో వున్నాయని వారు చెబుతున్నారు.

టాండ‌న్కు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెషనల్ ఏషియన్ పసిఫిక్ అమెరికన్ కాకస్ (సీఏపీఏసీ) సెనేటర్లకు లేఖ రాసింది.

ఆర్థిక, విదేశీ వ్యవహారాల్లో అపార అనుభవమున్న నీరాను ఆ పదవిలో నియమిస్తే.అమెరికా అభివృద్ధి, సంక్షేమంలో కీలక పాత్ర పోషిస్తారని కాకస్ ఆ లేఖలో పేర్కొంది.అలాగే “YesNeera” పేరుతో సోషల్ మీడియాలో క్యాంపెయిన్ సైతం మొదలుపెట్టారు.ఇదే సమయంలో రిపబ్లికన్ల తీరును వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ తప్పుబట్టారు.

నీరా గతంలో సోషల్ మీడియాలో వ్యవహరించిన తీరును సాకుకు చూపుతూ ఆమె నియామకాన్ని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.టాండన్ రెండు పార్టీల సెనేటర్లతో 44 సమావేశాలు జరిపారని సాకి చెప్పారు.

Telugu America, Indianamerican, Budget, White, Yesneera-Telugu NRI

ఒకవేళ సెనేట్‌ నీరా టాండన్‌ నియామకాన్ని సమర్థించినట్లయితే వార్షిక బడ్జెట్‌ను సిద్ధం చేసే ఫెడరల్ ఏజెన్సీకి నాయకత్వం వహించిన తొలి నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టిస్తారు.కాగా ఓహియోకు చెందిన రిపబ్లికన్ సెనేటర్ రాబ్ పోర్ట్‌మన్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.ధ్రువీకరణ ప్రక్రియలో తాను టాండన్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తానని తెలిపారు.రిపబ్లికన్ పార్టీకే చెందిన సెనేటర్లు సుసాన్ కాలిన్స్, మిట్ రోమ్నీలు సహా డెమొక్రాటిక్ పార్టీకి చెందిన జో మాంచీన్‌లు ఇప్పటికే నీరాకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని వెల్లడించిన సంగతి తెలిసిందే.100 మంది సభ్యులున్న సెనేట్‌లో రిపబ్లికన్లు, డెమొక్రాట్లు చెరిసగం వున్న సంగతి తెలిసిందే.తమ నాయకత్వాన్ని గతంలో టాండన్ విమర్శించారని రిపబ్లికన్ సెనేటర్లు ఆరోపిస్తున్నారు.

అంతేకాకుండా ఆ విధంగా చేసిన వేలాది ట్వీట్లను నీరా తొలగించిందని మండిపడుతున్నారు.

టాండన్ నామినేషన్‌పై సెనేట్ బడ్జెట్ కమిటీ బుధవారం ఓటింగ్‌ నిర్వహించనుంది.

ఆ తర్వాతి రోజు సెనేట్ హోంలాండ్ సెక్యూరిటీ అండ్ గవర్నమెంటల్ అఫైర్స్ కమిటీ ఓటింగ్ చేపడుతుంది.మరోవైపు నీరా నియామక ప్రక్రియలో ఆలస్యం ఇలాగే కొనసాగితే వార్షిక బడ్జెట్ సమర్పణపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం వుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube