ఇటీవల వైట్‌హౌస్ డొమెస్టిక్ పాలసీ అడ్వైజర్‌గా నియమితులైన భారత సంతతికి చెందిన నీరా టాండన్( Neera Tanden ).తన నియామకంపై హర్షం వ్యక్తం చేశారు.52 ఏళ్ల నీరా టాండన్.వైట్‌హౌస్‌లో ఈ శక్తివంతమైన పదవిని అందుకున్న తొలి ఆసియా అమెరికన్‌గా నిలిచారు.
ప్రస్తుతం ఆమె అమెరికా అధ్యక్షుడు జో బైడెన్( Joe Biden )కి సీనియర్ అడ్వైజర్, స్టాఫ్ సెక్రటరీగా సేవలందిస్తున్నారు.తన దేశీయ విధాన ఎజెండాను రూపొందించడంతో పాటు అమలు చేయడంలో నీరా సలహాలు ఇస్తారని నియామకం సందర్భంగా జో బైడెన్ తెలిపారు.
ఎకనమిక్ మొబిలిటీ, జాతి సమానత్వం, ఆరోగ్య సంరక్షణ, వలసలు, విద్య వంటి వాటిలో నీరాకున్న అనుభవం ఉపయోగపడుతుందని ఆయన ఆకాంక్షించారు.ఇప్పటి వరకు ఈ స్థానంలో సుసాన్ రైస్ విధులు నిర్వర్తించారు.
ఇదిలావుండగా.వైట్‌హౌస్ ( White House )లో తన కొత్త పాత్ర కోసం తాను ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నానని నీరా టాండన్ చెప్పారు.ఆసియా అమెరికన్, పసిఫిక్ హవాయి ద్వీపకల్ప వాసులు వున్న పరిపాలనా యంత్రాంగంలో తాను భాగం కాబోతుండటం ఆనందంగా వుందన్నారు.బుధవారం ఏఏపీఐ విక్టరీ ఫండ్ నిర్వహించిన ఏఏఎన్‌హెచ్‌పీఐ వేడుకలో పాల్గొన్న నీరా టాండన్ పై విధంగా వ్యాఖ్యలు చేశారు.
క్లింటన్ అధ్యక్షుడిగా వున్న సమయంలో వైట్‌హౌస్‌లో అతికొద్ది మంది ఏఏఎన్‌హెచ్‌పీఐ వ్యక్తులు మాత్రమే విధులు నిర్వర్తించేవారని ఆమె గుర్తుచేశారు.అయితే 25 ఏళ్ల తర్వాత బైడెన్ పరిపాలనా యంత్రాంగంలో ఏఏఎన్‌హెచ్‌పీఐ లేని శాఖ ఏదీ లేదన్నారు.
ఇప్పుడు వైట్‌హౌస్ విధాన మండలిలో ముగ్గురు ఏఏఎన్‌హెచ్‌పీఐ నాయకులు వుండటం మనందరికీ గర్వకారణమని నీరా టాండన్ అన్నారు.
నీరా .ఒబామా( Barack Obama ), క్లింటన్ పరిపాలనా యంత్రాంగాలలో పనిచేయడంతో పాటు పలు అధ్యక్ష ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు.ఇటీవల సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్, సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ యాక్షన్ ఫండ్‌కు అధ్యక్షురాలు, సీఈవోగా నీరా టాండన్ పనిచేశారు.