నవీన్ విజయ కృష్ణ( Naveen vijay krishna ).బోలెడంత సినిమా బ్యాగ్రౌండ్.
నానమ్మ, తండ్రి, తాత అందరు సినిమా ఇండస్ట్రీ కి చెందిన వారే.కానీ ఫలితం మాత్రం శూన్యం.
నవీన్ తండ్రి సపోర్ట్ తో హీరో గా ఎనిమిది ఏళ్ళ క్రితం పరిచయం అయ్యాడు.కేవలం నాలుగు అంటే నాలుగు సినిమాలతో ఇండస్ట్రీ నుంచి మాయం అయ్యాడు.
తానే సినిమా తీసుకోగల సత్తా ఉన్న కూడా ఎందుకో నవీన్ ఇక హీరో గా పనికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.నిన్నటికి నిన్న మంచు మనోజ్, సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష( Virupaksha ) సినిమా హిట్ అయినా కారణంగా ఒక పార్టీ నిర్వహించగా, అందులో కనిపించాడు.

నవీన్ అవతారం చూసి టాలీవుడ్ మొత్తం షాక్ కి గురయ్యింది.అస్సలు అతడు నవీన్ విజయ్ కృష్ణ అని గుర్తు పట్టడానికి చాల టైం పట్టింది.అంతగా లావు అయ్యి ఇక హీరో గా నటించడానికి తిలోదకాలు ఇచ్చినట్టు కనిపిస్తున్నాడు.అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం చాల రోజులుగా నవీన్ ఇంటి నుంచి బయటకు రావడం లేదు అంట.తండ్రి నాలుగో పెళ్లి వ్యవహారం, మీడియాలో వరస కథనాలు అతడిని బాగా డిస్టర్బ్ చేసినట్టు గా తెలుస్తుంది.పర్సనల్ లైఫ్ డిజాస్టర్ గా ఉన్న టైం లో సినిమాల గురించి ఆలోచించే పరిస్థితి ఎలా ఉంటుంది.
ఆ స్థానంలో ఎవరు ఉన్న అంతే.

అయితే నవీన్ మాత్రం తండ్రి చేస్తున్న పనుల వల్ల హ్యాపీ గా లేనట్టుగా తెలుస్తుంది.తన నానమ్మ కు ఎంతో మంచి పేరు ఉండేది ఇండస్ట్రీ లో.అది ఇంకా పెంచకపోయిన పర్వాలేదు కానీ తగ్గించే పనులు చేస్తూ హోటల్ రూమ్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి మీడియా ముందు వెకిలి వేషాలు వేయడం వల్ల ఫ్యామిలి పరువు పూర్తిగా పోయింది.పైగా ఈ వ్యవహారాలన్నీ కళ్లారా చుసిన కృష్ణ ( Krishna )గారు కూడా ఈ మద్యే కాలం చేయడం మరింత బాధించింది.ఆయన మరణం సమయంలో కూడా ఎవరికి నచ్చినట్టు వారు ప్రవర్తించడం వల్ల కూడా కొంత ఫ్యామిలి కి డ్యామేజ్ జరిగింది.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ మధ్య కాలంలో నవీన్ విజయ్ కృష్ణ ఎవరికి కనిపించే కూడదు అని డిసైడ్ అయ్యాడట.







