సుకుమార్ చంద్రశేఖర్ యేలేటి లో ఉన్న కామన్ పాయింట్ ఇదే ..!

సుకుమార్ ( Sukumar ) గురించి ఇప్పటికే ఎన్నో ఆర్టికల్స్ మనం చూస్తూనే ఉన్నాం.అయన సినిమా గురించి ఆలోచించే విధానం ప్రతి సారి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి.

 Common Points In Sukumar And Chandrasekhar Yeleti, Sukumar, Chandrasekhar Yeleti-TeluguStop.com

అలాగే సుకుమార్ హీరోలు కూడా సినిమా లో అనిపించే తీరు మిగతా హీరోలకు ఎంతో బిన్నంగా ఉంటాయి.సుకుమార్ హీరోలు లాజికల్ థింకింగ్ తో ఉంటారు.

పైగా వారిలో వారే స్ట్రగుల్ అవుతూ ఉంటారు.ప్రేమ ను త్యాగం చేస్తారు.

కుటుంబం కోసం రివెంజ్ కి వెళ్తారు.ఈ అంశాలను కథలుగా మలిచి ఎన్నో సినిమాలు వచ్చినప్పటికి సుకుమార్ సినిమాల లాగ ప్రభావాన్ని చూపించలేదు.

పైగా సుకుమార్ సినిమాలు ఒక ఆర్ట్ ఫామ్ తో వస్తూనే కమెర్షియల్ గా కూడా ఉండి బాక్స్ ఆఫీస్ ( Box Office ) వద్ద కలెక్షన్స్ కురిపిస్తూ ఉంటాయి.


Telugu Sukumar, Tollywood-Movie

అందుకే సుకుమార్ తో సినిమా చేయాలనీ ప్రతి ఒక్కరు కోరుకుంటారు.ఇప్పుడు పుష్ప ( Puspa )సీక్వెల్ తో బిజీ గా ఉన్న సుకుమార్ మరిన్ని సంచలనాలు నమోదు చేస్తారు అనడం లో ఎలాంటి సందేహం లేదు.ఇక సుకుమార్ లాగ ఆలోంచించి అతడికి సమకాలికులైన దర్శకులు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం ఒక్క చంద్రశేఖర్ యేలేటి ( Chandra sekar yeleti )మాత్రమే.

అయన సినిమాలు కూడా చాల భిన్నమైనవిగా ఉంటాయి.అలాగే సినిమాలో హీరోలు కూడా ఆలోచింపచేసే విధంగా ఉంటారు.2003 నుంచి ఇప్పటి వరకు కేవలం 8 సినిమాలు మాత్రమే తీసిన చంద్రశేఖర్ యేలేటి ప్రతి సినిమా కూడా ఎంతో ఇంటెన్స్ తో తీయడం విశేషం.అయన మొదటి సినిమా అయితే హిందీ లో కూడా తెరకెక్కి విజయం సాధించింది.


Telugu Sukumar, Tollywood-Movie

అనుకోకుండా ఒక రోజు, సాహసం, మనమంతా సినిమాలు చూస్తునంత సేపు మనం కూడా కథలో లీనమైపోయి ఎదో ఒక పరిశోధన చేస్తున్నాం అనే విధంగా ఉంటాయి.అయితే చంద్ర శేఖర్ యేలేటి ఒక్క సినిమా కూడా కమెర్షియల్ యాంగిల్ లో తీయలేదు.అయన హీరోలు పెద్ద పెద్ద స్టార్స్ కారు.ఆయన తీసిన సినిమాల్లో గోపి చంద్( Gopi chand) మరియు చివరి సినిమా చెక్ లో నితిన్ ( Nithin)తప్ప మిగత అంత కథ మాత్రమే హీరో గా భావించి తెస్తూ వచ్చాడు అలాగే విజయాలు కూడా సాధించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube