మన దేశం నుండే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల నుంచి కొంతమంది యువత చదువుకోవాలని లేదా ఉద్యోగం చేయాలని కలలు కంటూ ఉంటారు.అత్యుత్తమ ప్రమాణాలు, అధిక వేతనాలు చెల్లించే దేశాలను వీరు ఎంపీక చేసుకుంటూ ఉంటారు.
అందుకోసమే చాలామంది హైయర్ ఎడ్యుకేషన్ జాబ్స్ కోసం బ్రిటన్ వెళుతూ ఉంటారు.అయితే పరిమితులు నిబంధనల కారణంగా కొంతమందికే ఆ అవకాశం దక్కుతూ ఉంటుంది.
తాజాగా చాలామంది భారతీయులకు అవకాశం కల్పించేందుకు యూకే ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
రెండు సంవత్సరాల పాటు యూకే లో ఉండేందుకు ఉద్యోగాలు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తోంది.
ఎందుకు భారత్ బ్రిటన్ సంయుక్తంగా ప్రొఫెషనల్ స్కీంను ముందుకు తీసుకువచ్చాయి.భారతదేశం యూకే మధ్య యంగ్ ప్రొఫెషనల్ స్కీం ద్వారా వీసా నిబంధనలను సడలిస్తున్నట్లు వెల్లడించారు.
ఇంతకుముందు ఇలాంటి హోదా అనుభవిస్తున్న ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, జపాన్, తైవాన్, ఐస్లాండ్, మొనాకో, దక్షిణ కొరియా, హాంకాంగ్ వంటి కొన్ని దేశాల తో పాటు ఇండియా కూడా చేరిపోయింది.
యంగ్ ప్రొఫెషనల్ స్కీం ద్వారా 18 నుంచి 30 సంవత్సరాల వయసుగల మూడు వేలమంది గ్రాడ్యుయేట్స్ యూకే లో రెండేళ్లు పాటు నివసించే అవకాశాన్ని కల్పించింది.దీనికోసం స్పాన్సర్ లేదా చేతిలో ఉద్యోగం కూడా అవసరం లేదు.జపాన్ మినహా ఈ పథకాన్ని కలిగి ఉన్న ఏకైక దేశం భారతదేశం కావడం విశేషం.2023 యూత్ మొబిలిటీ స్కీం మొదటి బ్యాలెట్ జనవరి 17 మంగళవారం మొదలవుతుంది.
జనవరి 19 గురువారంతో ఈ బ్యాలెట్ ముగుస్తుంది.ఇతర దేశాల బ్యాలెట్కు మరికొన్ని రోజులు మాత్రమే ఉన్నందున 2023 జనవరి విడుతల్లో భారతదేశం చేరుతుందా లేదా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి.ఢిల్లీలో జరిగిన 15వ ఇండియా యు కె విదేశాంగ కార్యాలయ సంప్రదింపుల తర్వాత విడుదల చేసిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం ఈ పథకం ఫిబ్రవరి 28న ప్రారంభమవుతుంది.
భారత హై కమిషనర్ లో దౌత్యవేత్తలు ప్రకారం పథకం వివరాలు అర్హత దశల వారి దరఖాస్తు విధానాలను త్వరలో తెలుపనున్నట్లు వెల్లడించారు.