వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ అడుగులు

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలను పదును పెడుతోంది.ఈ క్రమంలో రెండు రోజులపాటు నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

 Bjp Aims To Win The Next Elections-TeluguStop.com

దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో ఎన్నికలు, 2024లో జరిగే సాధారణ ఎన్నికలు జరిగే నేపథ్యంలో తీసుకోవాల్సిన వ్యూహాలను ఖరారు చేసినట్లు సమాచారం.అదేవిధంగా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పార్టీ శ్రేణులకు ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు.

ఈ మేరకు సమాజంలోని అన్ని వర్గాలకు చేరువ కావాలని ఆయన పిలుపునిచ్చారు.లోక్ సభ ఎన్నికలకు ఇంకా నాలుగు వందల రోజుల సమయం మాత్రమే ఉందన్న మోదీ గెలుపు కోసం ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు.దేశానికి అత్యుత్తమ కాలం రాబోతుందని తెలిపారు.18 నుంచి 25 ఏళ్ల యువతపై దృష్టి సారించాలన్నారు.బీజేపీ సుపరిపాలన గురించి వారికి వివరించాలని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube