రేవంత్ ప్రమాణస్వీకారానికి ఏ రేంజ్ లో ఏర్పట్లంటే ? 

తెలంగాణ కాంగ్రెస్ ( Telangana Congress )అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revanth Reddy )నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.ఎల్బి స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు .

 In Which Range Should Revanth Take Oath , Brs, Telangana Government, Kcr, Cong-TeluguStop.com

దీనికోసం భారీగా ఏర్పాట్లు చేశారు.దేశవ్యాప్తంగా అనేకమంది కీలక నాయకులు ఈ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు.

అంతే స్థాయిలో ఏర్పాట్లు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.ఎల్బి స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత సచివాలయానికి వెళ్ళబోతుండడంతో , పోలీస్ శాఖ భారీగానే భద్రత ఏర్పాట్లు చేపట్టింది.

ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేశారు.ఎల్బీ స్టేడియం, సచివాలయం పరిసరాలు ,2000 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు.

జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసం నుంచి ఎల్బీ స్టేడియం రూట్ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు.బందోబస్తు బలగాలు రిహార్సల్స్ కూడా పూర్తి చేశాయి.

భారీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.

Telugu Aicc, Congress, Pcc, Priyanka Gandhi, Rahul Gandhi, Revanth Reddy, Sonia

ఎల్బీ స్టేడియం చుట్టూ నిఘా కోసం  ప్రత్యేక బృందాలను దింపారు.బందోబస్తు భద్రత విధులు,  సీఎం సెక్యూరిటీ విభాగంతో పాటు,  ఆక్టోపస్,  శాంతిభద్రతలు ,టాస్క్ ఫోర్స్ ,సిటీ సెక్యూరిటీ వింగ్, ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ , ఏ ఆర్ విభాగాలు, సాయుధ బాలగాల సిబ్బంది పాల్గొనబోతున్నారు.గురువారం ఉదయం నుంచి అన్ని ప్రాంతాల్లోనూ తనిఖీలు చేపడుతున్నారు .భారీగా మఫ్టీలో పోలీసులను ఆయా ప్రాంతాల్లో మోహరించారు.రూట్ టాప్ వాచ్ కోసం స్టేడియం చుట్టుపక్కల ఎత్తైన బిల్డింగ్స్ పై సూచితులైన సాయుధ బాలగాలను మోహరించారు.

  స్టేడియం చుట్టూ రహదారుల్లో నిలిచిపోయిన ప్రజల సౌకర్యార్థం ఆరు భారీ స్క్రీన్ లను ఏర్పాటు చేయాల్సిందిగా పోలీస్ శాఖ ప్రతిపాదించింది.

Telugu Aicc, Congress, Pcc, Priyanka Gandhi, Rahul Gandhi, Revanth Reddy, Sonia

రేవంత్ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ,( Sonia Gandhi ) రాహుల్ గాంధీ ,ప్రియాంక గాంధీ( Priyanka Gandhi ) హాజరు కాబోతున్నారు.  ఈరోజు ఉదయం 9:30 కి ఈ ముగ్గురు హైదరాబాద్ కు చేరుకోనున్నారు.  మధ్యాహ్నం 1.04 గంటలకు సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేస్తారు.రేవంత్ తో తమిళ సై సౌందర రాజన్  ప్రమాణస్వీకారం చేయిస్తారు.  ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సంతకం కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ ల అమలుపైన చేయనున్నారు.

  మధ్యాహ్నం మూడు గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో సచివాలయంకు రేవంత్ వెళ్లనున్నారు.ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి , మిగతా సీనియర్ ఐఏఎస్ అధికారులతో రేవంత్ రెడ్డి సమావేశమై తెలంగాణలో పాలనా పరిస్థితులు,  ఇతర అంశాల పైన సమీక్షిస్తారు.  ఇక రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా,  సీనియర్ నేతలు కే నారాయణ , సయ్యద్ అజిత్ భాష,  చాడా వెంకటరెడ్డి,  సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు తదితరులు హాజరు కాబోతున్నారు.ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు సైతం రేవంత్ ఆహ్వానాలు పంపించారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube