ఆ రెండింటిలో ఒకటి.. వాటితో పవన్ ఫ్యాన్స్ ను అలరించడం పక్కా అట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) లైనప్ లో చాలా క్రేజీ ప్రాజెక్ట్ ఉన్నాయి.వాటిల్లో బ్రో సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయ్యి ప్లాప్ గా నిలిచింది.

 In Those Two Months One From Pawan Kalyan, Director Sujeeth, Og Movie, Ustaad Bh-TeluguStop.com

దీంతో ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.అయితే పవన్ స్టామినాతో బిగ్గెస్ట్ ప్లాప్ నుండి మాత్రం బ్రో సినిమాను కాపాడారు.

ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యాక పవన్ కళ్యాణ్ నుండి నెక్స్ట్ రాబోతున్న ప్రాజెక్టులలో ‘ఓజి'( OG ), ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘హరిహర వీరమల్లు’ ఉన్నాయి.

Telugu Sujeeth, Harish Shankar, Og, Pawan Kalyan, Ustaadbhagat-Movie

వీటిలో ఏది ముందు పూర్తి అవుతుంది? ఏ సినిమా రిలీజ్ అవుతుంది అనేది తెలియాల్సి ఉంది.కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమాల గురించి రోజుకొక వార్త వైరల్ అవుతుంది.ముఖ్యంగా ఉస్తాద్ సినిమా( UStaad Bhagath Singh ) గురించి నెట్టినట్ ఓ రేంజ్ లో వార్తలు వస్తున్నాయి.

ఉస్తాద్ సంక్రాంతి కానుకగా రిలీజ్ అవ్వనుందంటూ రెండు రోజులుగా సోషల్ మీడియా కోడై కూస్తుంది.

అయితే మొన్నటి వరకు ఓజి సినిమా ఫాస్ట్ గా షూట్ పూర్తి అవుతుంది అని అంతా అనుకున్నారు.

ఇప్పటికే 50 శాతం పూర్తి చేసుకున్న ఈ సినిమా మరింత ఫాస్ట్ గా తెరకెక్కుతుంది.కానీ అనూహ్యంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా 2024 పొంగల్ రేస్ లో రిలీజ్ కాబోతుంది అంటూ రూమర్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.

ఉస్తాద్ మాత్రం కేవలం 10 రోజుల చిన్న షెడ్యూల్ మాత్రమే పూర్తి చేసుకుంది.

Telugu Sujeeth, Harish Shankar, Og, Pawan Kalyan, Ustaadbhagat-Movie

దీంతో ముందుగా ఓజి సినిమానే రిలీజ్ అయ్యేందుకు ఛాన్స్ ఉన్నప్పటికీ కానీ ఉస్తాద్ సంక్రాంతికి వస్తుందంటూ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి.మరి ఈ వార్తలపై తాజాగా మైత్రి మేకర్స్( Mythri Makers ) వారు క్లారిటీ ఇచ్చారు.ఉస్తాద్ భగత్ సింగ్ ను రానున్న సంక్రాంతికి లేదంటే సమ్మర్ బరిలో నిలుపుతాం అని చెప్పడంతో ఈ వార్తలు నిజమే అని తేలిపోయింది.

మరి తాజాగా వినిపిస్తున్న బజ్ ప్రకారం డిసెంబర్ అలానే జనవరి నెలల్లో పవన్ నటిస్తున్న ఓజి, ఉస్తాద్ లలో ఏదో ఒకటి పక్కాగా అయితే రిలీజ్ అవ్వనుంది అనేది మాత్రం కన్ఫర్మ్ అయ్యింది.ఈ వార్త విని పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఉస్తాద్, ఓజి ఏది రిలీజ్ అయినా బ్లాక్ బస్టర్ ఖాయం అని ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube