చైనా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సూపర్ టైఫూన్ ‘యాగి’( Yagi ) విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించిన తరువాత చైనాలోని ఔత్సాహిక పౌరులు తమ ఫోన్లను ఛార్జ్ చేసుకోవడానికి వీలుగా మార్కెట్లో జనరేటర్ ను ఎలా ఏర్పాటు చేశారో సంబంధించిన ఓ వీడియో వైరల్ వీడియోగా మారింది.చైనా ద్వీప ప్రావిన్స్ హైనాన్ ( China’s island province of Hainan )లో చిత్రీకరించిన ఈ వీడియోలో ఒక చిన్న దుకాణం చుట్టూ పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడి, వారి ఫోన్లు పవర్ అవ్వడానికి వేచి ఉండటం కనిపిస్తుంది.
ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో “నగదు రహిత సమాజం ప్రతికూలత” అనే శీర్షికతో పంచుకున్నారు.తుఫాను తరువాత నీరు, విద్యుత్ నిలిపివేయబడ్డాయి.
చైనా ప్రజలు తమ ఫోన్లను ఛార్జ్ చేయాలని తీవ్రంగా ఆలోచిస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఏర్పాటలను చేసుకున్నారు.
ఈ వీడియోను పోస్ట్ చేసిన ఎక్స్ ఖాతా, నగదు రహిత సమాజం కోసం చైనా చేసిన ప్రయత్నం అంటే.ప్రజలు బ్యాంకు నోట్లను తీసుకెళ్లరని తెలుపుతూ.అందుకు బదులుగా వారి డబ్బు మొత్తం వారి మొబైల్ ఫోన్లలో ఉందని.
, విద్యుత్ సరఫరాకు( power supply ) ఏదైనా అంతరాయం కలిగితే ఈ నగదు రహిత సమాజంలో భారీ లోపాలను బహిర్గతం చేస్తుందని తెలిపింది.అలాగే.
మీ డబ్బు అంతా మీ మొబైల్ ఫోన్లో ఉంది.మొబైల్ ఫోన్ లేకుండా, మీరు రొట్టె ముక్కను కూడా కొనుగోలు చేయలేరు అని వివరించింది.
ఇక వైరల్ గా మారిన వీడియోని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకుంటున్నారు.అక్కడి పరిస్థితి అతి త్వరలో బాగుపడాలని కొందరు కామెంట్ చేస్తుండగా.ప్రపంచం మొత్తం పరిస్థితి ఇలానే ఉన్నట్టు మరికొందరు కామెంట్ చేస్తున్నారు.