అద్బుతం : పిడుగు మీద పడ్డా బతికి బట్ట కట్టిన వ్యక్తి

పిడుగు పడితే పెద్ద పెద్ద చెట్టు కాలి బూడిద అవుతుంటాయి.ఇళ్లపై పిడుగు పడితే కూలిపోవడం కూడా జరుగుతుంది.

 In America Texas Man Hit By Lightning Luckily He Is Safe-TeluguStop.com

ఇక జంతువులు కూడా పిడుగుపాటుకి మరణించిన సందర్బాలు చాలా ఉన్నాయి.అలాంటిది ఒక మనిషిపై పిడుగు పడితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

పలు సందర్బాల్లో పిడుగు పడ్డ మనిషిని పరిశీలించినట్లయితే అతడి శరీర భాగాలు నాశనం అవ్వడంతో పాటు, అతడు కాలిపోయి కూడా కనిపిస్తాడు.ఒక బలమైన ఎలక్ట్రానిక్‌ కిరణం మనిషిపై పడ్డ సమయంలో అతడి శరీరం కాలంతో పాటు అతడి మైండ్‌ కూడా బ్లాంక్‌ అయ్యి మృతి చెందే అవకాశం ఉంటుంది.

Telugu Americatexas, Natural Treat, Tak, Texas-

  ఇప్పటి వరకు పిడుగుపాటుకు గురైన మనుషులు ఎవరు కూడా బతికి బట్ట కట్టినట్లుగా కనిపించడం లేదు.పిడుగు పడ్డ చోటుకు 100 మీటర్ల దూరంలో ఉన్నా కూడా కొందరు భయంతోనే ప్రాణాలు వదులుతారు.కాని అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన ఒక వ్యక్తి పిడుగు మీద పడ్డా కూడా మృత్యువును జయించాడు.అతడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

మనిషిపై పిడుగు పడటం ఇప్పటి వరకు ఏ వీడియోలో కూడా చూపించలేదు.మొదటి సారి టెక్సాస్‌లోని ఒక పార్క్‌లో ఉన్న సీసీ కెమెరా ఆ వీడియోను మనకు అందించింది.

Telugu Americatexas, Natural Treat, Tak, Texas-

  పూర్తి వివరాల్లోకి వెళ్తే.టెక్సాస్‌కు చెందిన అలెగ్జాండర్‌ కొరియస్‌ అనే వ్యక్తి మూడు కుక్కలను పట్టుకుని పార్క్‌లో వాకింగ్‌ చేస్తున్నాడు.ఆ కుక్కలు స్పీడ్‌గా నడుస్తుండగా వాటితో పాటు అలెగ్జాండర్‌ కూడా స్పీడ్‌ స్పీడ్‌గా నడుస్తూ ఉన్నాడు.

Telugu Americatexas, Natural Treat, Tak, Texas-

  ఆ సమయంలోనే ఒక పెద్ద మెరుపు మెరవడంతో పాటు ఆయన పైనే పిడుగు పడింది.దాంతో ఆ మనిషి అక్కడే కుప్పకూలి పోయాడు.అలెగ్జాండర్‌ కుప్పకూలి పోవడంతో కుక్కలు అక్కడ నుండి పరిగెత్తాయి.

Telugu Americatexas, Natural Treat, Tak, Texas-

  విషయం గమనించిన వారు వెంటనే అక్కడకు వెళ్లి గుండెపై మర్ధన చేయడం, ఆపై అతడికి కృత్రిమ శ్వాస ఇవ్వడం చేశారు.దాంతో అతడికి ఊపిరి అందింది.అదృష్టవశాత్తు అతడికి శరీరం కాలలేదు.కాని షాక్‌కు గుండె ఆగింది.వెంటనే గుండెపై మర్ధన చేయడంతో అతడి గుండెలో చైతన్యం కలిగింది.కాస్త ఆలస్యం అయినా కూడా అతడు బతికి బట్టకట్టేవాడు కాదు.

మీద పిడుగు పడ్డా కూడా బతికిన వ్యక్తిగా అద్బుతమైన రికార్డును అలెగ్జాండర్‌ కొరియన్‌కు దక్కింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube