రోజురోజుకూ కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది.తగ్గినట్టే తగ్గి మళ్ళీ కొత్త వేరియంట్ తో స్ట్రాంగ్ గా మన ముందుకు వచ్చింది.
రోజురోజుకూ కేసులు మరింత పెరుగు తున్నాయి.ఈసారి ఓమిక్రాన్ రూపంలో భారీ ముప్పు తప్పదని అందరికి అర్ధం అయ్యింది.
థర్డ్ వేవ్ కేసులు రోజురోజుకూ ఎక్కువ అవుతూ ప్రజల్లో మళ్ళీ భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.
మొదట్లో రోజుకి పదుల సంఖ్యలో నమోదైన కేసులు ఇప్పుడు వందలు దాటి వేలు, లక్షలు అవుతున్నాయి.
ఇలా లక్షల్లో కేసులు నమోదు అవ్వడంతో మళ్ళీ లాక్ డౌన్ దిశగా రాష్ట్రాలు అడుగులు వేస్తున్నాయి.ఇప్పటికే కొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూలు, ఆంక్షలు విధిస్తున్నారు.
ఇక కేసులు మరింత పెరిగితే ఈసారి కూడా లాక్ డౌన్ తప్ప మరొక అప్షన్ కూడా లేదు.
ఈ కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఇప్పటికే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది.
అయితే హిమాలయాల్లో కరోనా కు చెక్ పెట్టె మొక్కలను ఐఐటి మండి, ఐసీజీఎంబీ లు గుర్తించాయి.

హిమాలయాల్లో పెరిగే రోడో డెండ్రాన్ అర్బోనియం అనే మొక్కకు కరోనాకు ఎదుర్కొనే శక్తి ఉందని, ఈ మొక్కల్లో ఉండే పువ్వు రేకుల్లో ఫైటో కెమికల్స్ ఉన్నాయని.వీటిలో కరోనా వైరస్ ను ఎదుర్కొనే శక్తి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

స్థానికంగా ఈ రోడో డెండ్రాన్ అర్బోనియం మొక్కను బురాన్ష్ అని పిలుస్తారట.అక్కడి ప్రజలు ఈ మొక్క పూరేకులను ఔషధాలు తయారీలో వినియోగిస్తారట.టీకా లు లేకుండా వైరస్ ను అడ్డుకట్ట వేసేందుకు ఇతర పద్ధతులపై శాస్త్రవేత్తలు ఎప్పటి నుండో ద్రుష్టి పెట్టారు.
ఈ మొక్క నుండి లభించే ఔషదాలు శరీరంలోకి ప్రవేశించి వైరస్ ను అడ్డుకుంటాయని.శరీరానికి కూడా శక్తిని అందిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.