భారతదేశంలో ఎస్‌యూవిలకు వున్న డిమాండ్ గురించి ఇక్కడ ప్రత్యేకించి మాట్లాడుకోవలసిన పనిలేదు.ఈ క్రమంలో చిన్న కార్లు, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లు ఇండియాలో మంచి సేల్స్ చూస్తున్నాయి.
ఇక రాబోయే రోజుల్లో కూడా మార్కెట్లోకి చిన్న కార్ల విభాగంలో 4 కొత్త ఉత్పత్తులు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి.ఈ నాలుగు చిన్న కార్ల గురించి మీరు తెలుసుకుంటే అడ్వాన్స్ బుకింగ్ చేయక మానరు.
పైగా మైలేజి విషయంలో ఇవి బెస్ట్ ఆప్షన్స్ అని చెప్పుకోవచ్చు.

ఇందులో మొదటిది “కొత్త జనరేషన్ మారుతీ స్విఫ్ట్.” కొత్త జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ 2024లో రోడ్లపై పరుగెత్తనుంది.చిన్న కార్లలో ఈ కారు ఒకటి.తాజా నివేదికలు ప్రకారం కొత్త స్విఫ్ట్ 1.2L, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ద్వారా వస్తుంది.ఇక మైలేజీ విషయానికొస్తే 25 వరకు అందిస్తుంది.దేశంలోనే అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన కారుగా ఈ కారు పేరుగాంచిన విషయం విదితమే.ఆ తరువాత చెప్పుకోదగ్గ కారు “టాటా ఆల్ట్రోజ్ సిఎన్‌జి.” ఇది ఈ సంవత్సరం ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడింది.ఈ సంవత్సరమే ఇది మార్కెట్లోకి రాబోతోంది.ఈ హ్యాచ్‌బ్యాక్ డైనా-ప్రో టెక్నాలజీతో బూస్ట్ చేయబడిన 1.2L రెవోట్రాన్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది.ఈ కార్ 25 kmpl కంటే ఎక్కువ మైలేజ్ అందిస్తుంది.

ఈ లిస్టులో 3వది “కొత్త జనరేషన్ టాటా టియాగో.” టాటా మోటార్స్ దీనిని 2024 లేదా 2025లో మార్కెట్లోకి దించనున్నాయి.ఆల్ఫా ఆర్కిటెక్చర్ విభిన్న బాడీ స్టైల్స్, మల్టీ పవర్‌ట్రెయిన్‌లకు సపోర్ట్ ఇస్తుంది.టాటా టియాగో కొన్ని అధునాతన ఫీచర్లతో రావచ్చని ఓ అంచనా.అంతేకాకుండా అత్యధిక మైలేజి కూడా ఇస్తుందని తెలుస్తోంది.ఇక చివరగా “ఎంజి కామెట్ EV” గురించి మాట్లాడుకోవాలి.
ఎంజి మోటార్ ఇండియా రాబోయే 2-డోర్ల ఎలక్ట్రిక్ కారుకు ‘కామెట్’ అని పేరు పెట్టనున్నట్లు తాజాగా తెలిపింది.ఇది ఇండోనేషియా వంటి మార్కెట్లలో విక్రయించబడిన రీ-బ్యాడ్జ్డ్ వులింగ్ ఎయిర్ EV.ఈ మోడల్ 2023 మధ్య నాటికి మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది.ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు 300 కి.మీల రేంజ్‌ను అందిస్తుంది.