ఇలాంటి హెల్మెట్ వాడితే చలానా పడుతుంది... ఎందుకంటే?

హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారికి లైసెన్స్ రద్దు చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.అంతేకాకుండా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపితే అలాంటి వారికి కూడా భారీ జరిమానాలను వేస్తూ కఠిన చర్యలను చేపడుతుంది.

 Half Covering Helmet, Fine,danger,license Revoked, Hyderabad Traffic Police, Tra-TeluguStop.com

అయితే ఇప్పటికే ఈ నిబంధనలను హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ రూల్స్ ను స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు.

హెల్మెట్ ధరించకుండా, నిబంధనలను పాటించకుండా వాహనాలను నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ అధిక మొత్తంలో జరిమానాలను విధిస్తున్నారు.

వీటిలో ముఖ్యంగా హెల్మెట్ లేని వారిపై అధిక దృష్టి సారించిన ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేకుండా ప్రయాణించే ద్విచక్ర వాహనదారులపై పెద్ద ఎత్తున జరిమానా విధిస్తున్నారు.దీంతో అప్రమత్తమైన ప్రయాణికులు నగరంలో దాదాపు 90 శాతం మంది హెల్మెట్ ధరించి ప్రయాణం చేస్తుండడం గమనార్హం.

Telugu Danger, Fine, Helmet, License Revoked-Latest News - Telugu

హెల్మెట్ ధరించడం అనే నిబంధనల ప్రకారం తల, ముఖం పూర్తిగా కవర్ అయ్యే హెల్మెట్ లను మాత్రమే ధరించాలని ఈ సందర్భంగా తెలియజేశారు.అలా కవర్ అయ్యే హెల్మెట్ లను వాడకపోయినా చలానా విధించనున్నారని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.నాణ్యమైన, పూర్తిస్థాయిలో రక్షణ కల్పించే హెల్మెట్లు మాత్రమే వాడాలని వాహనదారులకు పోలీసులు సూచించారు.కేవలం హెల్మెట్ లేకుండా మాత్రమే కాకుండా, పలు రకాల రోడ్డు నిబంధనలను అతిక్రమించి వాహనాలు నడిపిన కూడా జరిమానాలు వర్తిస్తాయని తెలిపారు.

హెల్మెట్ లేకుండా ప్రయాణాలు చేయడంవల్ల రోడ్డు ప్రమాదాల బారినపడి నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు.ఈ రోడ్డు ప్రమాదాలను తగ్గించడం కోసం ఈ పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలియజేశారు.

అందుకోసమే ద్విచక్ర వాహనదారులు తప్పకుండా పూర్తిస్థాయిలో రక్షణ కల్పించే హెల్మెట్లు ధరించి, రోడ్డు నిబంధనలను పాటిస్తూ వాహనాలను నడపాలని, వాహనదారులకు పోలీసులు సూచనలిచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube