అందరూ ఒకటైతే మీరు మాత్రం ప్రత్యేకం... పవన్ పై రానా ప్రశంసలు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా మల్టీస్టారర్ చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్.ఈ సినిమా ఈనెల 25వ తేదీన విడుదల కానుంది ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించారు.

 If Everyone Is One But You Are Special Rana Praise On Pawan, Rana, Pawan Kalyan,-TeluguStop.com

ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు కోసం పలువురు రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.ఈ ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా రానా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలోకి వచ్చి 12 సంవత్సరాలు అయిందని అయితే ఇప్పటివరకు ఒక తెలుగు హీరో ఎలా అవ్వాలి అనే కాన్సెప్ట్ తనకు ఎప్పటికీ అర్థం కాలేదని తెలియజేశారు.ఇలాంటి కన్ఫ్యూషన్ లో ఉన్న సమయంలో నా కళ్ళ ముందుకు అసలు సిసలైన హీరో ఎంట్రీ ఇచ్చాడని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు.

ఇప్పటి వరకూ తాను తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఎంతో మంది స్టార్ హీరోలతో సినిమాలు చేశాను.

కానీ పవన్ కళ్యాణ్ సర్ ఎంతో ప్రత్యేకమని వీరందరూ ఒకటైతే పవన్ కళ్యాణ్ మాత్రం ఎంతో ప్రత్యేకమని ఈ వేడుకల్లో భాగంగా రానా పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు.ఇప్పటి వరకు తాను నటించిన సినిమాలన్నీ ఒకెత్తయితే పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ కారణంగా ఇకపై తాను నటించే సినిమాలన్నీ మరోలా ఉంటాయని తెలియజేశారు.ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను పవన్ కళ్యాణ్ నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానని రానా ఈ సందర్భంగా వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube