శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో టీడీపీ నేత నారా లోకేశ్( Nara Lokesh ) శంఖారావం యాత్ర ప్రారంభమైంది.ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ.
వైసీపీ ( YCP )ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ప్రభుత్వం డీఎస్సీ వేస్తామంటూ కొత్త మోసానికి తెరదీసిందని మండిపడ్డారు.
పాదయాత్ర సమయంలో జగన్ ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని విమర్శించారు.రానున్న ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈక్రమంలోనే ఇచ్చాపురం టీడీపీకి అడ్డా అన్న లోకేశ్ గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఇచ్చాపురానికి అనేక ప్రాజెక్టులు తీసుకువచ్చామని చెప్పారు.టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి సంవత్సరం డీఎస్సీ వేస్తామని తెలిపారు.
రైతులు, మత్స్యకారులను ఆదుకోంటామని చెప్పారు.దేశంలోనే కార్యకర్తల పార్టీ అంటే మొదటగా గుర్తుకు వచ్చేది టీడీపీ అని స్పష్టం చేశారు.