సూర్యతో గజిని 2 చేయాలి... కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కామెంట్స్!

తమిళ స్టార్ హీరో సూర్య,ప్రియాంక మోహన హీరోహీరోయిన్లుగా పాండిరాజ్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఈటీ.ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

 I Want Do Ghajini 2 With Surya Choreographer Johnny Master Comments , Johnny Mas-TeluguStop.com

సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు వెర్షన్ లో విడుదల చేయనుంది.ఇక ఈ సినిమా 10వ తేదీ విడుదల కావడంతో ఈ సినిమాలో ఒక సాంగ్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన జానీ మాస్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Telugu Choreographer, Ghajini, Johnny Master, Kalanidhi Maran, Pandiraj, Priyank

వ్యక్తిగతంగా తాను సూర్యకు ఎంతో పెద్ద అభిమానిని అని తెలియజేశారు. సూర్య ఎంతో జెన్యూన్ పర్సన్ అని జానీ మాస్టర్ వెల్లడించారు.ఈ సినిమాలో ఒక పాటను కంపోజ్ చేయడానికి చాలా కష్టపడ్డామని ఈ విషయంలో తనకు సహకరించిన కెమెరామెన్ రత్నవేల్ కి జానీ మాస్టర్ ధన్యవాదాలు తెలియజేశారు.ఇక సూర్య గురించి మాట్లాడుతూ ఆయన ఎవరు ఏమి చెప్పినా ఎంతో ఓపికగా వింటారని ఒక కొరియోగ్రాఫర్ గా నేను చెప్పిన బిట్ నేర్చుకోవడానికి ఎంతో కృషి చేస్తారని తెలిపారు.

ఇలా ఎంతో మంచి వ్యక్తిత్వం గల సూర్య గురించి మాట్లాడుతూ భర్త అనే వాడు ఎలా ఉండాలంటే ఖచ్చితంగా సూర్యలా ఉండాలి అని జానీ మాస్టర్ వెల్లడించారు.ప్రతిరోజు తన ఇంటి నుంచి క్యారేజ్ వస్తే అదే తినే వాళ్లమని ఈ సందర్భంగా సూర్య గురించి జానీ మాస్టర్ తెలిపారు.

ఇక సూర్య అభిమానిగా తాను నటించిన గజిని సినిమా తనకు ఎంతగానో నచ్చిందని, సూర్య గజిని 2 సినిమా చేస్తే ఇంకా చాలా బాగుంటుందని జానీ మాస్టర్ ఈ సందర్భంగా తన మనసులో ఉన్న మాటను బయట పెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube